Oil Adulteration: తక్కువకే వస్తుందని ఆశ పడి ఆ ఆయిల్ కొంటున్నారా? అయితే ఇటు ఓ లుక్కేసుకోండి..

|

Jan 12, 2023 | 8:02 AM

పండుగనే అవకాశంగా మార్చుకుని సరికొత్త మోసానికి దిగుతున్నారు. ఏకంగా నూనె డబ్బాలో నీళ్లు పోసి అమ్ముతూ ఘరానా మోసానికి పాల్పడుతున్నారు కల్తీగాళ్లు. చూసేందుకు నూనె డబ్బాలే..

Oil Adulteration: తక్కువకే వస్తుందని ఆశ పడి ఆ ఆయిల్ కొంటున్నారా? అయితే ఇటు ఓ లుక్కేసుకోండి..
Fake Oil
Follow us on

పండుగనే అవకాశంగా మార్చుకుని సరికొత్త మోసానికి దిగుతున్నారు. ఏకంగా నూనె డబ్బాలో నీళ్లు పోసి అమ్ముతూ ఘరానా మోసానికి పాల్పడుతున్నారు కల్తీగాళ్లు. చూసేందుకు నూనె డబ్బాలే.. పైగా రిఫైన్డ్ ఆయిల్ అంటూ స్టిక్కర్లు కూడా అంటించి ఉంటాయి. అవి చూసిన వారు ఎవరైనా ఒరిజినల్ ఆయిల్ అనే అనుకుంటారు. కానీ డబ్బా ఓపెన్ చేసి చూస్తే.. అసలు యవ్వారం బయటకు వచ్చింది. లోపల సగానికి పైగా నీళ్లే ఉన్నాయి. నూనె ఫ్లేవర్ కనిపించడానికి.. ఏదో పైన కొద్దిగా నూనె పోశారు. 15 లీటర్లు పట్టే డబ్బాలో సగానికి పైగా నీళ్లే ఉన్నాయి. ఈ నీళ్ల డబ్బాను అక్షరాలా 16 వందల రూపాయలకు అమ్మేశారు కేటుగాళ్లు.

పండుగపూట వంటనూనె సగం ధరకే ఇస్తామని కాలనీల్లో తిరుగుతూ అమ్మకాలు చేపట్టారు కల్తీగాళ్లు. లోపల నీళ్లు ఉన్న సంగతి తెలియని కస్టమర్లు.. ఈ డబ్బాలను కొనుక్కెళ్లారు. తీరా ఇంటికెళ్లాక చూస్తే.. అసలు యవ్వారం బయటపడింది. వరంగల్ జిల్లా.. రంగశాయిపేటలో ఈ దందా వెలుగులోకి వచ్చింది. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు.

అసలే సంక్రాంతి పండగ.. పెద్ద ఎత్తున పిండివంటలు చేయాలి. అర్జెంట్‌గా వెళ్లి నూనె తెచ్చేసుకోవాలంటూ వెళ్లేసి.. నూనె కొన్నారో బోల్తా పడ్డట్టే. బయట ఏదైనా కొనేముందు పరీక్షించుకోవడం తప్పనిసరి అని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..