తెలంగాణ విజృంభిస్తున్న విష జ్వరాలు.. రోజురోజుకూ పెరుగుతోన్న డెంగ్యూ కేసులు..

|

Aug 26, 2024 | 3:23 PM

తెలంగాణలో ప్రజలు విష జ్వరాలతో బాధపడుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని BRS నేతలు మండిపడుతున్నారు. ప్రజారోగ్యం కంటే ప్రభుత్వానికి కావల్సింది ఏమిటని నిలదీస్తున్నారు.

తెలంగాణ విజృంభిస్తున్న విష జ్వరాలు.. రోజురోజుకూ పెరుగుతోన్న డెంగ్యూ కేసులు..
Viral Fever
Follow us on

తెలంగాణలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. తెలంగాణలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్ రావు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఒక్క సమీక్ష కూడా చేయలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా అందుబాటులో లేవని మండిపడ్డారు.

రాష్ట్రంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, హెల్త్‌ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇప్పటికే నిజామాబాద్‌, కరీంనగర్‌ లాంటి జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్‌రావు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో కూడా బెడ్స్‌ దొరకని పరిస్థితి ఉందని, ఆ స్థాయిలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ముందుగా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని కోరుతున్నారు. విష జ్వరాలు, డెంగ్యూపై సమీక్షలు చేయకుండా ప్రభుత్వం, విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు హరీష్‌రావు.