BM Sandeep: తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్‌ నియామకం

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్‌ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛాన్స్‌గా కొనసాగిన మీనాక్షి నటరాజన్‌ స్థానంలో సందీప్‌ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బీఎం సందీప్ కర్నాటకలోని చిక్‌మగళూరుకు చెందిన వ్యక్తికా.. కాంగ్రెస్‌ పార్టీలో సీనియన్ నేతగా ఉన్నారు.

BM Sandeep: తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్‌ నియామకం
Bm Sandeep Appointed As New Telangana Congress In Charge

Updated on: Nov 14, 2026 | 7:28 PM

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్ వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీఎం సందీప్‌ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిన మీనాక్షీ నటరాజన పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆమె స్థానంలో బీఎం సందీప్‌ను నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్టు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) ఎంపీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్ నియామకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారని..ఆయన్ను తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా తక్షణమే అమల్లోకి వచ్చేలా నియమించాలని ఆదేశించినట్టు ఉత్తర్వుల్లో కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. అలాగే ఇన్నాళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన మీనాక్షి నటరాజన్‌కు పార్టీ అభింనందనలు తెలిపింది.

అసలు ఎవరూ బీఎం సందీప్
బీ.ఎం. సందీప్ కుమార్ కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సందీప్ అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో సందీప్ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్‌గా, కర్ణాటక రాష్ట్ర కన్వీనర్‌గా కూడా పనిచేశారు. ఏఐసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తూ గతంలో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలకు కో-ఇన్‌చార్జ్‌గా, అలాగే కేరళ రాష్ట్రానికి అదనపు ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియామకం అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us