గోనె సంచులతో.. బ్లేజర్..!

| Edited By:

Jul 19, 2019 | 11:40 AM

పర్యావరణ పరిరక్షణ‌పై ప్రజల్లో అవగాహణ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరిగిపోతోంది.. ఎటు చూసినా ప్లాస్టిక్ మయం కావడంతో.. ప్లాస్టిక్ యుగంలా మారిపోయింది. పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోంది. భవిష్యత్తు తీరాలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం కళ్లముందు కనిపిస్తోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు పెద్దలు.. నిజమే.. పురాతన వస్తువులే పుడమి తల్లిని కాపాడుతాయి. అందులో డౌటే లేదు. ఈ కోవలోకే వస్తుంది జూట్ వస్తువులు. ప్రస్తుతం జనపనారతో పరిశ్రమలకు గిరాకీ పెరిగింది. అందమైన […]

గోనె సంచులతో.. బ్లేజర్..!
Follow us on

పర్యావరణ పరిరక్షణ‌పై ప్రజల్లో అవగాహణ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరిగిపోతోంది.. ఎటు చూసినా ప్లాస్టిక్ మయం కావడంతో.. ప్లాస్టిక్ యుగంలా మారిపోయింది. పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోంది. భవిష్యత్తు తీరాలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం కళ్లముందు కనిపిస్తోంది.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు పెద్దలు.. నిజమే.. పురాతన వస్తువులే పుడమి తల్లిని కాపాడుతాయి. అందులో డౌటే లేదు. ఈ కోవలోకే వస్తుంది జూట్ వస్తువులు. ప్రస్తుతం జనపనారతో పరిశ్రమలకు గిరాకీ పెరిగింది. అందమైన వస్తువుల తయారీలో జూట్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. బ్యాగులు.. చెప్పులు అందమైన గృహ అలంకరణ వస్తువులు.. ఏవైనా సరే.. ఆధునిక మానవుల్ని కట్టిపడేస్తున్నాయి.

జగిత్యాల జిల్లా మాల్యాల మండలం తాటిపట్టికి చెందిన ఓ యువకుడికి ఓ ఐడియా వచ్చింది. మూడు గోనె సంచులతో.. మూడు గంటల్లో బ్లేజర్ తయారు చేశాడు. స్థానికంగా ఉండే మోహన్ అనే టైలర్ గోనె సంచులతో కోటు.. కుట్టి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఓ వ్యక్తి వద్ద మూడు గోనె సంచులను 10 రూపాయలకు కొని వాటితో బ్లేజర్ తయారు చేశాడు.