దిష్టిబొమ్మ దహనంలో అపశృతి

| Edited By:

Jun 24, 2019 | 3:22 PM

వరంగల్ జిల్లాలో బీజేపీ చేపట్టిన ఆందోళనలో అపశృతి చోటుచేసుకుంది. ఇటీవల 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు కూడా పాల్గోన్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో దిష్టిబొమ్మకు నిప్పంటించినప్పుడు అక్కడకు వచ్చిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో దిష్టిబొమ్మకు […]

దిష్టిబొమ్మ దహనంలో అపశృతి
Follow us on

వరంగల్ జిల్లాలో బీజేపీ చేపట్టిన ఆందోళనలో అపశృతి చోటుచేసుకుంది. ఇటీవల 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు కూడా పాల్గోన్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో దిష్టిబొమ్మకు నిప్పంటించినప్పుడు అక్కడకు వచ్చిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో దిష్టిబొమ్మకు ఓ కార్యకర్త నిప్పు అంటించడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అవి కాస్త అక్కడే ఉన్న ఇద్దరు కార్యకర్తలపై పడటంతో.. తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.