Telangana: పెట్రోల్ బంక్‌లో బైక్ కిక్ కొట్టగానే ఒక్కసారిగా మంటలు.. ఆ రైతు సాహసం చేయకపోతే

|

Jun 26, 2022 | 6:56 PM

పెట్రోల్ బంక్‌లో ఓ బైక్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైతు సమయస్పూర్తిగా వ్వవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. వీడియో చూడండి.

Telangana: పెట్రోల్ బంక్‌లో బైక్ కిక్ కొట్టగానే ఒక్కసారిగా మంటలు.. ఆ రైతు సాహసం చేయకపోతే
Bike Catches Fire
Follow us on

Motorbikes catches fire: అతనో రైతు, పైగా వృద్ధుడు, కానీ, ఊహించని విధంగా బైక్‌లో మంటలు చెలరేగి తగలబడిపోతుంటే ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. పెను ప్రమాదం జరగకుండా ఆపాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా( Mahbubnagar district) జడ్చర్ల(Jadcherla)లో ఈ ఇన్సిడెంట్‌ జరిగింది.పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ పోయించుకున్నాడు సదరు రైతు. బండిని పక్కకు తీసుకొచ్చి కిక్‌ కొట్టాడు. అంతే, ఒక్కసారిగా మంటలు చెలరేగాయ్‌. ఊహించని పరిణామంతో షాక్‌కి గురైన ఆ రైతు, చాకచక్యంగా వ్యవహరించాడు. పెట్రోల్‌ బంకుకు మంటలు అంటుకోకుండా బైక్‌ను దూరంగా జరిపాడు. ఒకపక్క మంటలు చెలరేగుతున్నా, భయపడకుండా బైక్‌ను లాక్కెళ్లాడు. మంటలు అంటుకుని బైక్‌ తగలబడిపోతుంటే పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది భయంతో ఉరుకులు పరుగులు తీశారు. బంకుకు మంటలు అంటుకుంటాయేమోనని భయపడ్డారు. అయితే, పెను ప్రమాదాన్ని ఊహించిన ఆ వృద్ధుడు… ధైర్యంగా బైక్‌ను దూరంగా లాక్కుని రావడంతో భారీ ఫైర్‌ యాక్సిడెంట్‌ తప్పింది. పెట్రోల్‌ పోయించుకుని, కిక్‌ కొట్టగానే మంటలు చెలరేగాయని అంటున్నాడు రైతు. మొదట మంటలను ఆర్పేందుకు ప్రయత్నించానని, కానీ ఆరకపోవడంతో బైక్‌ను దూరంగా లాక్కొచ్చానని చెబుతున్నాడు వృద్ధుడు.

తెలంగాణ వార్తల కోసం