Telangana: కాళేశ్వరంపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తామంటున్న కాంగ్రెస్‌!.. అంత దమ్మూ, ధైర్యం ఉందా? అంటున్న కేసీఆర్‌!

|

Feb 13, 2024 | 7:05 PM

తెలంగాణలో సాగునీటి రాజకీయం సలసల కాగుతోంది. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట నల్గొండలో నిరసనసభ నిర్వహించిన బీఆర్‌ఎస్‌.. అధికార కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసింది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొన్న గులాబీ బాస్‌ కేసీఆర్‌... కాంగ్రెస్‌ప్రభుత్వానికి స్ట్రాంగ్‌వార్నింగ్‌ ఇచ్చారు. మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Telangana: కాళేశ్వరంపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తామంటున్న కాంగ్రెస్‌!.. అంత దమ్మూ, ధైర్యం ఉందా? అంటున్న కేసీఆర్‌!
Telangana Politics
Follow us on

తెలంగాణలో సాగునీటి రాజకీయం సలసల కాగుతోంది. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట నల్గొండలో నిరసనసభ నిర్వహించిన బీఆర్‌ఎస్‌.. అధికార కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసింది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొన్న గులాబీ బాస్‌ కేసీఆర్‌… కాంగ్రెస్‌ప్రభుత్వానికి స్ట్రాంగ్‌వార్నింగ్‌ ఇచ్చారు. మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇక, ఇదేరోజున మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్‌ అండ్‌ టీమ్‌… కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. కేసీఆర్‌ చెప్పిన కోటి ఎకరాల మాగాణి ఓ అబద్ధమని చెప్పారు రేవంత్‌. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను దేశంలోనే అతిపెద్ద స్కామ్‌గా ఆరోపించిన మంత్రి ఉత్తమ్‌… క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ చేయిస్తామని చెప్పారు.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..