
ఎవరేమనుకున్నా సరే నా మనసంతా ఆ ఫ్యూచర్ సిటీనే.. అని ఓపెన్‌గానే చెప్పేశారు సీఎం రేవంత్‌రెడ్డి. క్షీణించిపోతున్న ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే భారత్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నాం అని చెబుతూనే, దాంతో పాటు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ స్టేట్‌గా తన రాష్ట్రం ఎంత ఎత్తుకు ఎదిగిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, చేశాం.. అని తన ఫోర్త్ సెన్స్‌ని బయట పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్… కొత్త ప్రపంచాన్ని కొత్తగా నిర్మించడం ఎలా? ఇలా గ్లోబల్ థీమ్‌తో మొదలైంది భారత్ సమిట్ 2.ఓ. ముగిసిపోయింది కూడా. 70 దేశాల నుంచి వెయ్యి మంది అంతర్జాతీయ ప్రతినిధులొచ్చి కృత్రిమ మేధస్సు నుంచి ప్రపంచ రాజకీయ, సామాజిక, వాతావరణ వ్యవస్థల దాకా మాట్లాడారు. కానీ, అదే వేదిక మీద తెలంగాణ రైజింగ్ థీమ్‌తో ప్రత్యేకంగా సెషన్లు కూడా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ పథకాల్ని చెబుతూ, ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని కూడా భారత్ సమిట్ సైడ్‌లైన్స్‌లో చేర్చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో జరిగిన ఇంటరాక్షన్లలో కూడా పట్టణీకరణ, ఫ్యూచర్ సిటీలే మేజర్ టాపిక్స్ అయ్యాయి. ఆ విధంగా ఫ్యూచర్ సిటీ ఐడియాను అంతర్జాతీయ ప్రతినిధుల ఎదుట ఆవిష్కరించి, తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న సంస్థల్ని ఎట్రాక్ట్ చెయ్యబోయారు. హైదరాబాద్‌ను రీడిజైన్ చేయాలి, అంతర్జాతీయ రాజకీయ, సామాజిక, ఆర్థిక చర్చలకు ప్రధాన...