Telangana: రఫ్పాడిస్తున్న రాహుల్.. తగ్గని జోష్.. పెరిగిన క్రేజ్.. అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ

|

Nov 03, 2022 | 1:17 PM

భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ సందడి చేస్తూ సాగుతున్నారు. అడుగడుగునా జనంతో కలిసిపోతూ..అభిమానంతో వచ్చిన వాళ్లను అక్కున చేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. రాహుల్‌ రోమ్‌, రోమన్‌ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లుగా ఉంది.. ఎక్కడికక్కడ స్థానికులతో మమేకం అవుతూ.. సంప్రదాయాలను గౌరవిస్తూ..ఆచారాలను వల్లె వేస్తూ పాదయాత్ర చేస్తున్నారు.

Telangana: రఫ్పాడిస్తున్న రాహుల్.. తగ్గని జోష్.. పెరిగిన క్రేజ్..  అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ
Rahul Gandhi In Jodo Yatra
Follow us on

తెలంగాణలో జరుగుతున్న భారత్‌జోడో యాత్రలో రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. చిన్నపిల్లలతో కలిసిపోయి పిల్లాడిలా రన్నింగ్‌ రేసులో పాల్గొన్నారు. ఆ తర్వాత క్రికెట్‌ కూడా ఆడారు. ఆయన నడిచే స్పీడు.. జనంతో కలిసే విధానం, బ్యాటింగ్ స్టైల్‌ చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో తన బ్యాటింగ్‌ మామూలుగా ఉండదని సైన్స్ ఇస్తున్నారా అన్నట్లుందని ఫాలోవర్స్‌ టాక్. గురువారం సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో.. ఎదురైన పొతురాజులతో మాటా మంతి కలిపారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి కొరడాతో కొట్టుకుంటూ హల్‌చల్‌ చేశారు రాహుల్ గాంధీ. దీంతో.. స్థానికంగా ఉండే సంస్కృతి, సంప్రదాయాల్ని తెలుసుకుని వాటిని ఆచరించి చూపారు.

అంతకుముందు ఉదయం రుద్రారం నుంచి నడక ప్రారంభించిన రాహుల్..పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఓ హోటల్‌కు వెళ్లి టీ తాగుతూ.. అక్కడి వాళ్లతో కాసేపు ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా రాహుల్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చారు. పలువురు విద్యార్థులు కూడా ఆయన వెంట ఉత్సాహంగా నడకలో పాల్గొన్నారు.. వారితో మాట్లాడుతూ..సంతోషంగా ముందుకు సాగుతూ..దారిలో గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారు. రాహుల్‌ పాదయాత్ర చేస్తూ.. దాదాపు రెండు నెలలు కావస్తున్నా.. ఎక్కడా ఆయన అలసిపోయినట్లు కనిపించలేదు. పైగా రెట్టించిన ఉత్సాహంతో పరిగెత్తుతున్నారు. ఒక దశలో వెంట నడుస్తున్న వారే.. ఆయనతో పరిగెత్తలేక నీరసపడుతున్నారు.. రాహుల్‌ మాత్రం నడుస్తూ..నవ్విస్తూ..జోష్‌నింపుతూ యాత్రలో అన్నీ తానై ముందుకెళ్తున్నారు.

మరోవైపు రాహుల్‌ నడక, స్పీడ్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 52 ఏళ్ల వయసు.. చుట్టూ వందలు, వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, జనం మధ్య రాహుల్‌ వడివడిగా దూసుకెళ్తున్నారు. తాజాగా.. వాకింగ్‌ మారథాన్‌ చేద్దామని.. రోజులో వీలైనన్ని కిలోమీటర్లు నడిచేద్దామని రాహుల్‌ గాంధీ చెప్పడంతో..కాంగ్రెస్‌నేతలు షాకయ్యారు. రాహుల్‌ మారథాన్‌ మేటర్‌పై ఎలా స్పందించాలో అర్థంగాక రేవంత్‌రెడ్డి కాసేపు మౌనంగారు ఉన్నారట. ఆ తర్వాత తేరుకుని..బ్రేక్‌ లేకుండా మారథానా.. ఇప్పటికే మీ స్పీడ్‌ను అందుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.. మహారాష్ట్ర లోని నాందేడ్‌ దాటిన తర్వాత మారథాన్‌కు ప్లాన్‌ చేసుకోండి అని రాహుల్‌తో సరదాగా అన్నారట.. ఆయన మాత్రం.. విశ్రాంతి, విసుగు లేకుండా.. అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ సాగుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి