GHMC: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ నెల 16న ఉదయం 11 .30 గంటలకు ఎక్కడివారక్కడే..

|

Aug 14, 2022 | 8:43 PM

Jana Gana Mana: ఈ నెల 16 వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఎక్కడి వారు అక్కడే ఆగి జన గణ మన అధినాయక జయహే అనే జాతీయ గీతం ను అలపించాల నీ నగర ప్రజలను కోరారు.

GHMC: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ నెల 16న ఉదయం 11 .30 గంటలకు ఎక్కడివారక్కడే..
Jana Gana Mana
Follow us on

భారత దేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఊరు-వాడల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11 .30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది జీహెచ్ఎంసీ. ఆగస్టు 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వజ్రోత్సావ స్ఫూర్తి గా తీసుకొని ఈ నెల 16 వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఎక్కడి వారు అక్కడే ఆగి జన గణ మన అధినాయక జయహే అనే జాతీయ గీతం ను అలపించాల నీ నగర ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ప్రవేటు సంస్థలు, ప్రభుత్వ ప్రవేటు విద్య సంస్థ లు యూనివర్సిటీలు, వ్యాపార వాణిజ్య సముదయాలు, మాల్స్, సినిమా థియేటర్లు, షాపులు, యజమానులు తప్పని సరిగా సామూహిక జాతీయ గీతం ను అలాపించాలని హైదరాబాద్ నగరవాసులను జీహెచ్ ఏంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కోరారు. ఈ నెల 16 వ తేదీన సాయంత్రం 3 గంటలకు లిబర్టీ వద్ద గల జి హెచ్ ఏం సి హెడ్ ఆఫీస్ లో దేశ భక్తి పై కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.

ఇదిలావుంటే.. తెలంగాణ పోలీస్‌శాఖ కూడా ఇందులో పాల్గొంటోందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారని మహేందర్‌రెడ్డి అభినందించారు. ఆయా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని 16న నిర్వహించే జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి నుంచి అన్ని ప్రధాన రహదారులు, జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో అందరూ పాల్గొనేలా పోలీస్‌శాఖలోని అధికారులంతా కృషి చేయాలని మహేందర్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, పోలీస్ కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు, గుర్తించిన ఇతర దేశాల్లో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించాలని సూచించారు మహేందర్‌రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం