Telangana: కొమురంభీం జిల్లాలో కలకలం రేపుతున్న పోస్టర్లు..

| Edited By: Narender Vaitla

Mar 28, 2024 | 5:33 PM

సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో ఉన్నంతవరకు బహుజన వాదిగానే ఉంటాను అంటూ చెప్పి కెసిఆర్ పంచన చేరారంటూ ఆరోపిస్తూ బహుజనుల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ కు తాకట్టు పెట్టావా అంటూ ప్రశ్నిస్తూ వెలిసిన పోస్టర్లు సిర్పూర్ నియోజకవర్గం లో తీవ్ర కలకలం రేపాయి...

Telangana: కొమురంభీం జిల్లాలో కలకలం రేపుతున్న పోస్టర్లు..
Rs Praveen Kumar
Follow us on

మాజీ ఐపీఎస్ అధికారి.. తెలంగాణ మాజీ బీఎస్పీ అద్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కు కొమురంభీం జిల్లాలో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీలో చోరీ తొలి సారిగా సిర్పూర్ నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం కలకలం రేపింది. బహుజన ద్రోహి గో బ్యాక్ అంటూ కొమురం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలంలో ఫ్లెక్సీలు వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసాయి.

సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో ఉన్నంతవరకు బహుజన వాదిగానే ఉంటాను అంటూ చెప్పి కెసిఆర్ పంచన చేరారంటూ ఆరోపిస్తూ బహుజనుల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ కు తాకట్టు పెట్టావా అంటూ ప్రశ్నిస్తూ వెలిసిన పోస్టర్లు సిర్పూర్ నియోజకవర్గం లో తీవ్ర కలకలం రేపాయి.

‘బహుజన ద్రోహి.. ఆర్ఎస్పీ గో బ్యాక్’ అంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించినట్టు తెలుస్తోంది. తాజా పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ తో బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందంటూ తెలంగాణ అద్యక్షుడి హోదాలో ప్రకటించడం.. జాతీయ అధ్యక్షురాలు అందుకు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో బీఆఎస్పీ పార్టీకి రాజీనామా చేసి ఆ వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు ప్రవీణ్ కుమార్.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిర్పూర్ నియోజక వర్గ బీఎస్పీ నేతలంతా ఆ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ వస్తుండగా.. గో బ్యాక్ ఆర్ఎస్పీ.. బహుజన ద్రోయి గో బ్యాక్ అంటూ పోస్టర్లు వెలియడం కలకలం రేపాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..