Paddy: తెలంగాణకు ఆంధ్రా వడ్లు.. వెనక్కు పంపిస్తున్న అధికారులు.. అసలు విషయమేంటంటే

|

Apr 15, 2022 | 9:14 AM

తెలంగాణలో యాసంగి వరిని ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు ధాన్యం తరలివస్తోంది. తెలంగాణ ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.1960 ఇస్తామన్న...

Paddy: తెలంగాణకు ఆంధ్రా వడ్లు.. వెనక్కు పంపిస్తున్న అధికారులు.. అసలు విషయమేంటంటే
Paddy
Follow us on

తెలంగాణలో యాసంగి వరిని ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు ధాన్యం తరలివస్తోంది. తెలంగాణ ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.1960 ఇస్తామన్న ప్రకటనతో ఏపీ నుంచి తెలంగాణకు భారీ మొత్తంలో ధాన్యం వస్తోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారులు వరిని తెలంగాణకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర(Andhra Pradesh) నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి నల్గొండ తెలంగాణ – ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ-రామాపురం క్రాస్‌రోడ్డు, నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి వద్ద, నాగార్జునసాగర్‌(Nagarjuna Sagar) పైలాన్‌ కాలనీ కొత్త వంతెన వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. లారీలు, ట్రాక్టర్లను అడ్డుకుని వెనక్కు పంపిస్తున్నారు. పంపారు. దీంతో ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమను అడ్డుకోవడం ఏమిటని రైతులు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్ర నుంచి సూర్యాపేట, నకిరేకల్‌కు వస్తున్న లారీలను, జగ్గయ్యపేట నుంచి కోదాడ మీదుగా వస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీస్‌, రెవెన్యూ అధికారులు అడ్డుకుని వెనక్కి పంపారు. ఏపీ నుంచి తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం రానిచ్చేది లేదని అధికారులు పేర్కొన్నారు. ఏపీలో కరెంట్ కోతలు ఎక్కువ ఉన్న కారణంగా మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని ఆంధ్ర ప్రాంత రైతులు ఆవేదన చెందారు.

Also Read

 Owaisi Convoy: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి చేదు అనుభవం.. కాన్వాయ్‌ని అడ్డుకున్న ఆందోళనకారులు

China: అల్లాడిపోతున్న చైనా.. ఆదుకోవాలంటూ అరుపులు, కేకలతో జనం హాహాకారాలు..!