ప్రణయ్‌కు అంకితమిచ్చిన అంబేద్కర్ సేవారత్న జాతీయ అవార్డ్..!

|

Apr 16, 2019 | 5:32 PM

ఢిల్లీ: అంబేద్కర్ 128 వ జయంతి పురస్కరించుకుని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా.. వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన విశేష వ్యక్తులకు అంబేద్కర్ సేవారత్న జాతీయ అవార్డ్‌లను అందజేయడం జరిగింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన డాక్టర్ ఆనంద్ ఈ అవార్డ్ అందుకున్నారు. డాక్టర్ ఆనంద్ ఇప్పటి వరకు బాలికా విద్య, మానవ హక్కుల పరిరక్షణ, మహిళా సాధికారతలను కథాంశాలుగా ఎంచుకుని ‘అంటు రానితనం’. ‘చిరు తేజ్ సింగ్’ […]

ప్రణయ్‌కు అంకితమిచ్చిన అంబేద్కర్ సేవారత్న జాతీయ అవార్డ్..!
Follow us on
ఢిల్లీ: అంబేద్కర్ 128 వ జయంతి పురస్కరించుకుని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా.. వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన విశేష వ్యక్తులకు అంబేద్కర్ సేవారత్న జాతీయ అవార్డ్‌లను అందజేయడం జరిగింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన డాక్టర్ ఆనంద్ ఈ అవార్డ్ అందుకున్నారు.
డాక్టర్ ఆనంద్ ఇప్పటి వరకు బాలికా విద్య, మానవ హక్కుల పరిరక్షణ, మహిళా సాధికారతలను కథాంశాలుగా ఎంచుకుని ‘అంటు రానితనం’. ‘చిరు తేజ్ సింగ్’ లాంటి లఘు చిత్రాలు రూపొందించారు. ఈ చిత్రాలకు జాతీయ స్థాయి అవార్డ్‌లు కూడా లభించడం విశేషం. వీటితో పాటు జ్యాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా, ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా పలు మ్యూజిక్ వీడియోలను కూడా రూపొందించి అశేష ప్రేక్షకాదరణ పొందారు. మరోవైపు డాక్టర్‌గా కూడా ఆయన అందించిన విశేష సేవలకు గానూ ఈ అవార్డు ఆయనకు దక్కింది. కాగా న్యూఢిల్లీలో ఈ వేడుక అతిరథమహారధుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.
మరోవైపు అవార్డు అందుకున్న డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ అవార్డ్‌ను ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంగా దారుణ హత్యకు గురైన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌కి అంకితమిస్తున్నట్లుగా తెలిపారు. కాగా ఈ అవార్డు అందుకోవడానికి తనకు అన్ని రకాలుగా సహకరించిన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.