Telangana – BJP: ప్రధాని పర్యటనకు భద్రత కట్టుదిట్టం.. ఇంకా పాసులు జారీ చేయని బీజేపీ..

| Edited By: Anil kumar poka

Jul 01, 2022 | 4:32 PM

BJP Meetin- Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. నాలుగు అంచెల్లో..

Telangana - BJP: ప్రధాని పర్యటనకు భద్రత కట్టుదిట్టం.. ఇంకా పాసులు జారీ చేయని బీజేపీ..
Bjp
Follow us on

BJP Meetin- Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. నాలుగు అంచెల్లో భద్రతా కల్పిస్తున్నారు. ప్రధాని చుట్టూ SPGతోపాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో నిఘా పెట్టారు. మోదీ వెళ్లే ప్రాంతాల్లో స్నిప్పర్స్, క్విక్ రెస్పాన్స్ బృందాలు, మఫ్టీ పార్టీలు నిఘా పెట్టాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాలన్నీ పరిశీలించింది ఎస్పీజీ. మరోవైపు లా అండ్ ఆర్డర్‌పై సిటీ పోలీసులతో SPG అధికారుల సమీక్ష చేశారు. నోవాటెల్‌, HICC చుట్టు మెట్రో బంద్ ఉంటుంది. డ్రోన్లపై ఆంక్షలు పెట్టారు. ఆదివారం సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం నుంచే ఫ్లైఓర్‌ను క్లోజ్‌ చేస్తారు. ఆ చుట్టూ పక్కల ఉన్న భవనాలను శనివారం నుండి తమ ఆధీనంలో తీసుకోబోతోంది SPG.

సభా ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్..
ప్రధాని మోదీ పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పా్ట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పరిశీలించారు. ఈ నెల 3వ తేదీన మోదీ బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. ఈ సభ కోసం నాలుగు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ నాయకులు. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి ఇవ్వనున్నారు. కాగా, సభకు పది లక్షల మంది సభకు హాజరవుతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలను తరలించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. వర్షం వస్తే ఇబ్బందులు లేకుండా గ్రౌండ్స్ మొత్తం రూఫ్‌తో కవర్ చేస్తూ ఏర్పాట్లు చేశారు. అలాగే.. మోదీ, జాతీయ కార్యదర్శులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేకంగా ఎంట్రెన్స్ ఏర్పాటు చేశారు. ఇక సభ నేపథ్యంలో గ్రౌండ్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి ఎస్పీజీ, ఆర్ఏఎఫ్, లోకల్ పోలీసులు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లలో కో-ఆర్డినేషన్ వైఫల్యం..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లలో కో ఆర్డినేషన్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. నేతల మధ్య సమన్వయ లోపంతో హెచ్ఐసిసి వద్ద గందరగోళం నెలకొంది. ఈ సమన్వయలోపం కారణంగా పాసుల జారీలో చేతులు ఎత్తేశారు నేతలు. సమావేశాల సమయం సమీపిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ ఎవరికి పాసులు ఇవ్వలేదు బీజేపీ. పాసులు లేకపోవడంతో సమావేశానికి వస్తున్న బీజేపీ శ్రేణులను హెచ్ఐసిసి మెయిన్ గేటు వద్దే ఆపెస్తున్నారు పోలీసులు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. సమావేశాల బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలకు సైతం పాసులు లేవు. దీంతో హెచ్ఐసిసి మెయిన్ గేట్ వద్ద అయోమయం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..