ప్రైవేట్ బస్సులో తనిఖీలు చేస్తుండగా.. ప్రయాణీకుడి తత్తరపాటు.. బ్యాగ్ చెక్ చేయగా

|

Aug 07, 2024 | 8:44 AM

సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా దగ్గర జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తనిఖీలు చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

ప్రైవేట్ బస్సులో తనిఖీలు చేస్తుండగా.. ప్రయాణీకుడి తత్తరపాటు.. బ్యాగ్ చెక్ చేయగా
Private Bus
Follow us on

సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా దగ్గర జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తనిఖీలు చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. తనిఖీల్లో సుమారు 4.8 కిలోల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్‌కు వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో చంద్రేష్‌ అనే వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బంగారంతో పాటు, దాన్ని తరలిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్రమ బంగారం రవాణాపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. బంగారం ఎక్కడ నుంచి వచ్చింది.. ఎక్కడి తరలిస్తున్నారనే కోణం ఎంక్వైరీ చేస్తున్నారు. అక్రమ బంగారం రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..