Telangana: నేత్రదానంపై అవగాహన కల్పించేలా.. డీపీఎస్‌ వరంగల్‌లో సదస్సు

|

Sep 10, 2024 | 6:16 PM

ఈ సందర్భంగా అతిథులు నేత్రదాన ప్రాముఖ్యతను దేశంలో కర్ణి సంబంధిత వ్యాధుల పరిష్కారంలో దేశం సాధించిన పురోగతిని విద్యార్థులకు వివరించారు. ఈ సమావేశంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ జి. భరత్ కుమార్ గారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నేత్రదానం విధానాలు కర్ణి వ్యాధుల ప్రభావం, నేత్రదానం వల్ల మరొకరి జీవితంలో కలిగే మార్పులు, నేత్రదానం...

Telangana: నేత్రదానంపై అవగాహన కల్పించేలా.. డీపీఎస్‌ వరంగల్‌లో సదస్సు
Dps Warangal
Follow us on

39వ జాతీయ నేత్రదాన అవగాహనా సదస్సు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు దేశంలోని కొన్ని ప్రత్యేకమైన అర్హతలు కలిగిన సి.బి.ఎస్.ఈ పాఠశాలలను ఎంపిక చేసింది. అందులో డి.పి.ఎస్. వరంగల్ ఒకటని పాఠశాల చైర్మన్ శ్రీ రవి కిరణ్ రెడ్డి గారు తెలియజేశారు. పాఠశాలలోని 9 మరియు 10 తరగతుల విద్యార్థులకు నేత్రదానం పై అవగాహన కల్పించేందుకు, వరంగల్ ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంటు మరియు ఆప్తమాలజీ విభాగాధిపతి, డాక్టర్ జి. భరత్ కుమార్ గారు మరియు ఆప్తమాలజీ సర్జన్ డాక్టర్ సిహెచ్. అపర్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అతిథులు నేత్రదాన ప్రాముఖ్యతను దేశంలో కర్ణి సంబంధిత వ్యాధుల పరిష్కారంలో దేశం సాధించిన పురోగతిని విద్యార్థులకు వివరించారు. ఈ సమావేశంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ జి. భరత్ కుమార్ గారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నేత్రదానం విధానాలు కర్ణి వ్యాధుల ప్రభావం, నేత్రదానం వల్ల మరొకరి జీవితంలో కలిగే మార్పులు, నేత్రదానం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. కార్యక్రమం చివరిలో విద్యార్థులు, నేత్రదానం చేయడంలో ఎదురయ్యే సమస్యలను ప్రశ్నల రూపంలో అడగగా, వాటికి చక్కని ఉదాహరణలతో సమాధానాలను ఇస్తూ, విద్యార్థులకు నేత్రదానంపై ఉన్న అపోహలను పోగొట్టి ఒక స్పష్టమైన అవగాహన కల్పించారు.

దేశంలోని కొన్ని ప్రత్యేకమైన పాఠశాలలకు మాత్రమే ఈ అవగాహన సదస్సును నిర్వహించే అవకాశం రావడం, అందులో డి.పి.ఎస్ వరంగల్ ఎంపిక అవడం పాఠశాలకు గర్వంగా ఉందని చైర్మన్ శ్రీ రవి కిరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు డి.పి.ఎస్ వరంగల్ కి కొత్తవి కాదని, అవన్నీ పాఠశాల వార్షిక ప్రణాళికలో అంతర్భాగమని, ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక విషయాలపై అవగాహన కలిగించేందుకు డి.పి.ఎస్. వరంగల్ ఎప్పుడూ ముందుంటుందని ప్రిన్సిపాల్ డా. ఇన్నారెడ్డి గారు తెలియజేశారు. సామాజిక స్పృహను కలిగించే అన్ని కార్యక్రమాలలో డి.పి.ఎస్. వరంగల్ విద్యార్థులు ఎప్పుడు పాల్గొంటారు. తద్వారా దేశం గర్వించదగ్గ పౌరులుగా విద్యార్థులు తీర్చిదిద్దబడతారు. విద్యార్థులలో సమాజం పట్ల ఒక స్పష్టమైన బాధ్యతను నిర్దేశించడం డి.పి.ఎస్ వరంగల్ వార్షిక ప్రణాళికలో అంతర్భాగం.

Eye Donation Awareness

2014వ సంవత్సరంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో పెండ్యాలలో 12 ఎకరాల సువిశాలమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో డి.పి.ఎస్ వరంగల్ స్థాపించబడింది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో, సుస్థిరమైన విద్యా ప్రమాణాలతో, నడపబడుతున్న తెలంగాణలోని ఏకైక డే&రెసిడెన్షియల్ సి.బి.ఎస్.ఈ పాఠశాల. విశాలమైన క్రీడా మైదానాలు, అత్యాధునిక బోధనా సామాగ్రి, డిజిటల్ క్లాస్ రూమ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయులు డి.పి.ఎస్ వరంగల్ బలం. స్విమ్మింగ్ పూల్, ఫుట్ బాల్ మరియు బాస్కెట్ బాల్ కోర్టులు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇక్కడ విద్యార్థులకు అందింపబడుతుంది. పోటీ పరీక్షలకు అవసరమైన మానసిక శారీరక సామర్థ్యాన్ని పెంచే యోగ మరియు మెడిటేషన్ వంటి శిక్షణలపై డి.పి.ఎస్ వరంగల్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. పాఠశాల స్థాపించిన సంవత్సరం నుండి 12 మరియు 10 తరగతి బోర్డు ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధిస్తున్న వరంగల్ లోని ఏకైక సి.బి.ఎస్.ఈ పాఠశాల డి.పి.ఎస్ వరంగల్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..