కలుషిత నీరు తాగి 34 మంది విద్యార్థినులకు అస్వస్థత

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:30 PM

కొమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత నీరు తాగి 34 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మూడ్రోజుల క్రితం హాస్టల్లోని బోర్ చెడిపోయింది. మరమ్మత్తులు జరుగుతుండగానే.. వేరే గత్యంతరం లేక అదే నీటిని స్టూడెంట్స్ తాగుతున్నారు. ఈ క్రమంలోనే రాత్రి నీళ్లు తాగిన తర్వాత 34 మంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. స్టూడెంట్స్ పరిస్థితి గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే.. ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థినులలను ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శించి.. […]

కలుషిత నీరు తాగి 34 మంది విద్యార్థినులకు అస్వస్థత
Follow us on

కొమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత నీరు తాగి 34 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మూడ్రోజుల క్రితం హాస్టల్లోని బోర్ చెడిపోయింది. మరమ్మత్తులు జరుగుతుండగానే.. వేరే గత్యంతరం లేక అదే నీటిని స్టూడెంట్స్ తాగుతున్నారు. ఈ క్రమంలోనే రాత్రి నీళ్లు తాగిన తర్వాత 34 మంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. స్టూడెంట్స్ పరిస్థితి గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే.. ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థినులలను ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శించి.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.