గుట్టలుగా మేకల మృతదేహాలు..వీధి కుక్కలు చంపాయంటే నమ్ముతారా..?

| Edited By: Anil kumar poka

Oct 29, 2019 | 7:14 PM

ఎన్నో రోజులు నుంచి పెంచుకుంటున్న మేకలు. ఆయనకు అవే జీవనాధారం. కానీ పండుగ పూట ఓ రెండు గంటలు కాపలా లేనందుకు అవి ఊహించని విధంగా మృత్య్సువాత పడ్డాయి. తిర్యాణి మండలం రోంపల్లి పంచాయతీ పరిధిలోని పెర్కగూడలో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. కొర్వేత తుకారాంకు చెందిన మేకల దొడ్డిపై ఆదివారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో 26 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఉదయం మేకల మందను అడవిలో మేపుకుని ఆదివారం సాయంత్రం గ్రామ […]

గుట్టలుగా మేకల మృతదేహాలు..వీధి కుక్కలు చంపాయంటే నమ్ముతారా..?
Follow us on

ఎన్నో రోజులు నుంచి పెంచుకుంటున్న మేకలు. ఆయనకు అవే జీవనాధారం. కానీ పండుగ పూట ఓ రెండు గంటలు కాపలా లేనందుకు అవి ఊహించని విధంగా మృత్య్సువాత పడ్డాయి. తిర్యాణి మండలం రోంపల్లి పంచాయతీ పరిధిలోని పెర్కగూడలో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. కొర్వేత తుకారాంకు చెందిన మేకల దొడ్డిపై ఆదివారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో 26 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.

ఉదయం మేకల మందను అడవిలో మేపుకుని ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలోని దొడ్డిలో తోలాడు. ఆ తర్వాత దీపావళి సందర్భంగా ఇంటి వద్ద పూజలు ముగించుకొని.. రాత్రి 8 గంటల సమయంలో మేకల మంద వద్దకు వెళ్లగా వీధి కుక్కలు దాడి చేస్తూ కనిపించాయి. వాటిని తరిమివేసి పరిశీలించగా 26 మేకలు మృతి చెందాయి. మేకలు మృతి చెందడంతో యజమాని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.