Hyderabad: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన విదేశీ సిగరెట్లు.. రూ. 50 లక్షల విలువైన..

|

Jul 30, 2022 | 9:46 PM

హైదరాబాద్‌లో భారీగా సిగరెట్లు, ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. దుబాయ్ మరియు షార్జా నుంచి తీసుకొస్తుండగా..

Hyderabad: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన విదేశీ సిగరెట్లు..  రూ. 50 లక్షల విలువైన..
Cigarettes
Follow us on

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ సిగరేట్లు పట్టబడ్డాయి. భారీగా సిగరెట్లు, ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. దుబాయ్, షార్జా నుంచి తీసుకొస్తుండగా.. కస్టమ్స్ అధికారులు గత వారం రోజుల్లో షార్జా.. దుబాయ్ నుంచి 14 మంది ప్రయాణికులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 50 లక్షల విలువైన సిగరెట్లు, ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. తాజా ఘటనలో షార్జా నుంచి సిగరెట్లు, ఈ-సిగరెట్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఆరుగురు ప్రయాణికులు పట్టుబడ్డారు.

వస్తువులను సీజ్ చేశారు.. తదుపరి విచారణ జరుగుతోంది- కస్టమ్

6E1406 విమానంలో ప్రయాణికులు శుక్రవారం వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు శనివారం తెలిపారు. వారి నుంచి రూ.11.66 లక్షల విలువైన 22,600 సిగరెట్లు, 940 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ కస్టమ్స్ తెలిపింది. తదుపరి విచారణ కొనసాగుతోంది.

వారం వ్యవధిలో ఇది మూడో కేసు

జూలై 25న విమానాశ్రయంలో ఆరుగురు ప్రయాణికులు పట్టుబడ్డారు.

ముగ్గురు ప్రయాణికులు సుమారు రూ.14 లక్షల విలువైన 40,800 సిగరెట్లు, 1010 ఈ-సిగరెట్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. అంతకుముందు జూలై 25న విమానాశ్రయంలో ఆరుగురు ప్రయాణికులు పట్టుబడ్డారు. వారు దుబాయ్, షార్జా నుండి వరుసగా EK526,  6E1406 విమానాలలో వచ్చారు. సుమారు రూ.25 లక్షల విలువైన సిగరెట్లు, ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..