యూట్యూబ్ కొత్త రూల్స్..! వారికి మాత్రమే..

| Edited By:

Sep 15, 2019 | 11:23 AM

సాధారణంగానే.. ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్‌డేట్ అవుతూ ఉంటుంది. మారినప్పుడల్లా.. కొత్త కొత్త సెట్టింగ్స్, రూల్స్ వస్తూనే ఉంటాయి. కానీ.. యూట్యూబ్ రూల్స్ మాత్రం.. సపరేట్. ఏంటా అనుకుంటున్నారా..! మామూలుగా.. యూట్యూబ్‌లో ఒక వీడియో పెట్టినప్పుడు.. యాడ్స్ చూసే వాళ్ల వ్యూస్ బట్టి.. యూట్యూబ్ వారు రేటింగ్ ఇస్తూంటారు. చాలా వీడియోలకు కింద వ్యూస్.. లక్షల్లో, కోట్లల్లో ఉంటాయి కదా.. ఇప్పుడు ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా.. ఈ సంవత్సరం జులైలో ఓ భారతీయ ర్యాప్ సింగర్ […]

యూట్యూబ్ కొత్త రూల్స్..! వారికి మాత్రమే..
Follow us on

సాధారణంగానే.. ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్‌డేట్ అవుతూ ఉంటుంది. మారినప్పుడల్లా.. కొత్త కొత్త సెట్టింగ్స్, రూల్స్ వస్తూనే ఉంటాయి. కానీ.. యూట్యూబ్ రూల్స్ మాత్రం.. సపరేట్. ఏంటా అనుకుంటున్నారా..!

మామూలుగా.. యూట్యూబ్‌లో ఒక వీడియో పెట్టినప్పుడు.. యాడ్స్ చూసే వాళ్ల వ్యూస్ బట్టి.. యూట్యూబ్ వారు రేటింగ్ ఇస్తూంటారు. చాలా వీడియోలకు కింద వ్యూస్.. లక్షల్లో, కోట్లల్లో ఉంటాయి కదా.. ఇప్పుడు ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా.. ఈ సంవత్సరం జులైలో ఓ భారతీయ ర్యాప్ సింగర్ వీడియో, కేవలం ఒక్క రోజులోనే యూట్యూబ్‌లో 7.5 కోట్ల వ్యూస్ సాధించింది. ఈ సంఖ్యను మ్యానిపులేట్ చేశారని, తప్పుడు మార్గాల్లో పెంచారని.. తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన యూట్యూబ్ నిర్వాహకులు.. ఇకపై పెట్టే వీడియోలకు కొన్ని నిభందనలు చేశారు.

ఇకపై అప్‌లోడ్ చేసే వీడియోల్లోని యాడ్స్ ఎంతమంది చూశారని కాకుండా.. ఇతర పద్దతుల ఆధారంగా ఎంతమంది చూశారన్న లెక్కను గణిస్తారంట. అలాగే.. 24 గంటల్లో రికార్డు వ్యూస్ అన్న అంశంపైనా మార్పులు చేయనున్నారని తెలిపారు. కాగా.. వీడియో డైరెక్ట్‌గా షేర్ చేసుకుని, సెర్చ్ చేసి వీడియోలు చూస్తుండం వంటి సహజ సిద్ధమైన ప్రక్రియల ఆధారంగా ఎంతమంది చూశారన్న విషయం కౌంటింగ్ నిర్వహిస్తామని యూట్యూబ్ కంపెనీ బ్లాగ్‌లో తెలిపింది.