వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్..

|

Jun 26, 2020 | 3:49 AM

యూజర్లను ఆకట్టుకోవడంలో ముందుండే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు ఒక కొత్త ఫీచర్‌ను...

వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్..
Follow us on

WhatsApp New Features : యూజర్లను ఆకట్టుకోవడంలో ముందుండే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ముఖ్యంగా స్టికర్స్‌ను ఎక్కువగా వినియోగించే వారి కోసం ఈ మార్పులు చేస్తోంది. మరిన్ని అపడేట్స్ తీసుకురావడానికి వాట్సాప్ కొత్తగా ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగానే ఆండ్రాయిడ్ , ఐఓఎస్ వినియోగదారుల కోసం యానిమేటెడ్ స్టిక్కర్లను తీసుకువచ్చే పనిలో వాట్సాప్ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన ‘బీటా’ వర్షన్‌ కొంత మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఫైనల్ వర్షన్ విడుదలైతే ఇక చాటింగ్‌ను మరింత ఎంజాయ్ చేయవచ్చు.

ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ యూజర్లు ఈ యానిమేటెడ్ స్టిక్కర్లను తమ మిత్రులకు షేర్ చేయవచ్చు. వాటిని రిసీవ్ చేసుకున్న వ్యక్తులు.. వెంటనే సేవ్ చేయడం ఈజీగా మారుతుంది. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు అందరికి అందుబాటులోకి తీసుకురాలేదు. ఫైనల్ వర్షన్ అధికారికంగా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.