వాట్సప్‌లో మరో లేటెస్ట్ ఫీచర్..

| Edited By:

Dec 19, 2019 | 6:06 AM

వాట్సప్.. ఇప్పుడు ప్రతి స్మార్ట్ ఫోన్‌లో దాదాపుగా ఉపయోగించే సోషల్ మీడియా యాప్. అయితే ఈ అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కొత్తగా ఏం ఏం ఫీచర్స్‌ ఎందుకు ఉపయోగపడుతాయన్నది చాలామందికి తెలియదు. తాజాగా వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లేటెస్ట్ ఫీచర్‌తో మీరు పంపే మెసేజ్‌లు డిలీట్ చేయాలనుకుంటే ఎంతో సులభం. ఇంతకుముందు మెసెజ్ డిలీట్ చేయాలనుకుంటే..ఆ మెసేజ్‌ను సెలక్ట్ చేసి.. డిలీట్ ఆప్షన్‌ క్లిక్ చేయాల్సి వచ్చేది. […]

వాట్సప్‌లో మరో లేటెస్ట్ ఫీచర్..
Follow us on

వాట్సప్.. ఇప్పుడు ప్రతి స్మార్ట్ ఫోన్‌లో దాదాపుగా ఉపయోగించే సోషల్ మీడియా యాప్. అయితే ఈ అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కొత్తగా ఏం ఏం ఫీచర్స్‌ ఎందుకు ఉపయోగపడుతాయన్నది చాలామందికి తెలియదు. తాజాగా వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లేటెస్ట్ ఫీచర్‌తో మీరు పంపే మెసేజ్‌లు డిలీట్ చేయాలనుకుంటే ఎంతో సులభం. ఇంతకుముందు మెసెజ్ డిలీట్ చేయాలనుకుంటే..ఆ మెసేజ్‌ను సెలక్ట్ చేసి.. డిలీట్ ఆప్షన్‌ క్లిక్ చేయాల్సి వచ్చేది. అయితే తాజాగా వచ్చిన ఫీచర్‌తో ఆ పనిలేదు. మీరు పంపిన మెసేజ్.. మీరు అనుకున్న సమయంలో ఆటోమేటిక్‌గా అదృశ్యమైపోతుంది. ఇదే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఫీచర్.‌

ఈ ఫీచర్‌ను తొలుత ‘డిసప్పీయరింగ్ మెసేజెస్’ పేరుతో రూపొందించింది. ఆ తర్వాత పేరును ‘డిలీట్ మెసేజెస్’ అని ఛేంజ్ చేసింది. అంటే దీనర్థం మెసేజ్‌ను పూర్తిగా డిలీట్ చేయడం. ప్రస్తుతం మెసేజ్ పంపిన తర్వాత కొద్ది సమయం వరకు మాత్రమే డిలీట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ లేటెస్ట్ ఫీచర్‌తో మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడే.. మెసేజ్ డిలీట్ చేయవచ్చు. అది కూడా మీరు మెసేజ్ పంపించేప్పుడే సెట్ చేసుకోవచ్చు. ఇందులో మెసేజ్ డిలీట్ చేసేందుకు.. ప్రత్యేకంగా ఛాట్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. మీరు అనుకున్న టైమ్ సెట్ చేస్తే చాలు.. సరిగ్గా ఆ సమయానికి మెసేజ్ డిలీట్ అవుతుంది.

ఉదాహరణకు.. మీరు ఒక గంట.. లేద ఒక రోజు, నెల, ఇలా టైం సెలక్ట్ చేసి.. మెసేజ్ పంపితే.. సరిగ్గా సెట్ చేసిన సమయానికి ఆ మెసేజ్ డిలీట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అప్‌డేట్ బేటా యూజర్లకు అందుబాటులో ఉంది. బేటా టెస్టింగ్ పూర్తైన తర్వాత.. మిగతా అందరి యూజర్లకు ఈ తాజా ఫీచర్ అందుబాటులోకి రానుంది.