వాట్సాప్‌ నుంచి ఫేస్‌బుక్‌కు.. సరికొత్త ఫీచర్

|

Sep 24, 2019 | 1:43 PM

ప్రఖ్యాత సోషల్ మీడియా యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తోంది. తాజాగా బీటా వెర్షన్ వినియోగదారులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘వాట్సాప్’‌ను ఫేస్‌బుక్ సంస్థ కొనుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండిటి మధ్య అనుసంధాన్ని పెంచేందుకు కొత్త మార్పుతో ముందుకొచ్చింది. అదేంటంటే.. ఇప్పటివరకూ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టే అప్‌డేట్స్‌ని ఫ్రెండ్స్ చూడగలిగేవారు, కామెంట్స్ చేసేవారు. అలాగే యూజర్లు కూడా తమ స్టేటస్‌ను వాట్సాప్ ద్వారా మాత్రమే తెలపగలిగేవారు. అయితే ఇప్పుడు […]

వాట్సాప్‌ నుంచి ఫేస్‌బుక్‌కు.. సరికొత్త ఫీచర్
Follow us on

ప్రఖ్యాత సోషల్ మీడియా యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తోంది. తాజాగా బీటా వెర్షన్ వినియోగదారులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘వాట్సాప్’‌ను ఫేస్‌బుక్ సంస్థ కొనుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండిటి మధ్య అనుసంధాన్ని పెంచేందుకు కొత్త మార్పుతో ముందుకొచ్చింది. అదేంటంటే.. ఇప్పటివరకూ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టే అప్‌డేట్స్‌ని ఫ్రెండ్స్ చూడగలిగేవారు, కామెంట్స్ చేసేవారు. అలాగే యూజర్లు కూడా తమ స్టేటస్‌ను వాట్సాప్ ద్వారా మాత్రమే తెలపగలిగేవారు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సరికొత్త ఫీచర్‌తో ఇకపై వాట్సాప్ స్టేటస్‌ను డైరెక్ట్‌గా షేర్ చేసేయొచ్చు. తద్వారా వాట్సాప్‌లో టచ్‌లోని ఫ్రెండ్స్ కూడా మన అప్డేట్స్‌ను తెలుసుకోవచ్చు. ఈ సౌలభ్యం ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు అందరూ వాడుకోవచ్చు.

షేర్ చేయండి ఇలా…

వాట్సాప్‌లో స్టేటస్‌ను అప్‌‌లోడ్ చేసుకున్న తర్వాత కుడివైపు మూడు చుక్కలను క్లిక్ చేస్తే ‘షేర్ టు ఫేస్ బుక్ స్టోరీ’ అనే ఆప్షన్ కనపడుతుంది. అది క్లిక్ చేస్తే డైరెక్ట్ ఫేస్‌బుక్‌లో‌కి వాట్సాప్ స్టేటస్ పోస్ట్ అవుతుంది.

మరో కొత్త ఫీచర్….

‘వాట్సాప్ మ్యూట్’ అనే కొత్త ఆప్షన్‌ను కూడా వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్ధంపర్ధం లేని మెసేజ్‌లతో కొందరు రోజూ మనల్ని చిరాకు పెట్టిస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ ఫీచర్. వాళ్ళను మ్యూట్ చేస్తే ఆ వ్యక్తుల షేరింగ్ పూర్తిగా మనకు కనిపించకుండా వాట్సాప్ హైడ్ చేస్తుంది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.