ఇకపై ట్విట్టర్‌లో రోజుకు ఎంతమందిని ఫాలో అవ్వాలంటే..

| Edited By: Srinu

Apr 10, 2019 | 7:20 PM

ఫేక్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్.. ఇలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెట్టడం.. కొత్తవారిని, సెలబ్రిటీలను ఫాలో కావడం ప్రస్తుతం నేటి యువత పోకడ. అయితే ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విట్టర్‌.. బాట్‌, స్పామ్‌లకు చెక్‌ పెట్టేందుకు కొత్త నిబంధనలను పెట్టింది. ఈ నిబంధనల ప్రకారం ఇకపై ట్విట్టర్‌లో ఏ యూజర్‌ అయినా సరే.. రోజుకు 400 మందిని మాత్రమే ఫాలో అయ్యేందుకు వీలుంటుంది. 400 మందిని దాటితే ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తుంది. అయితే […]

ఇకపై ట్విట్టర్‌లో రోజుకు ఎంతమందిని ఫాలో అవ్వాలంటే..
Follow us on

ఫేక్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్.. ఇలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెట్టడం.. కొత్తవారిని, సెలబ్రిటీలను ఫాలో కావడం ప్రస్తుతం నేటి యువత పోకడ. అయితే ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విట్టర్‌.. బాట్‌, స్పామ్‌లకు చెక్‌ పెట్టేందుకు కొత్త నిబంధనలను పెట్టింది. ఈ నిబంధనల ప్రకారం ఇకపై ట్విట్టర్‌లో ఏ యూజర్‌ అయినా సరే.. రోజుకు 400 మందిని మాత్రమే ఫాలో అయ్యేందుకు వీలుంటుంది. 400 మందిని దాటితే ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తుంది. అయితే ఇది కేవలం నాన్‌ వెరిఫైడ్‌ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుంది. వెరిఫైడ్‌ అకౌంట్లు ఉన్న ట్విట్టర్‌ యూజర్లు రోజుకు 1000 మందిని ఫాలో అవచ్చు. అలాగే ఏ యూజర్‌ అయినా సరే గరిష్టంగా 5వేల మందిని మాత్రమే ఫాలో అవచ్చు. ఆ పరిమితి దాటితే యూజర్లు కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారి ఫాలోవర్ల సంఖ్య పెరిగితే అందుకు అనుగుణంగా వారికి ఇతర అకౌంట్లను ఫాలో అయ్యేందుకు అవకాశం ఇస్తారు. కాగా ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే అమలులోకి వచ్చాయని ట్విట్టర్‌ ఒక ట్వీట్‌లో వెల్లడించింది.