నిరుద్యోగులకు బంపరాఫర్.. ఒకే దెబ్బకు 3 లక్షల ఉద్యోగాలు

| Edited By:

Oct 19, 2019 | 6:29 PM

నిరుద్యోగులపై ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నా.. కొన్ని బహుళ జాతి సంస్థలు మాత్రం వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తమ తమ ఫ్లాట్‌ఫామ్‌లలో లక్షలమందికి ఉపాధిని చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రానున్న18 నెలల్లో 3లక్షలమందిని నియమించుకోవాలని ఆ సంస్థ యోచిస్తోందట. దీంతో తమ ఉద్యోగుల బలాన్ని 5 లక్షలకు తీసుకెళ్లాలని భావిస్తోందట. ఒకవేళ ఇది వాస్తవ రూపం దాలిస్తే.. దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న […]

నిరుద్యోగులకు బంపరాఫర్.. ఒకే దెబ్బకు 3 లక్షల ఉద్యోగాలు
Follow us on

నిరుద్యోగులపై ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నా.. కొన్ని బహుళ జాతి సంస్థలు మాత్రం వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తమ తమ ఫ్లాట్‌ఫామ్‌లలో లక్షలమందికి ఉపాధిని చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రానున్న18 నెలల్లో 3లక్షలమందిని నియమించుకోవాలని ఆ సంస్థ యోచిస్తోందట. దీంతో తమ ఉద్యోగుల బలాన్ని 5 లక్షలకు తీసుకెళ్లాలని భావిస్తోందట. ఒకవేళ ఇది వాస్తవ రూపం దాలిస్తే.. దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న మూడవ అతిపెద్ద ప్రైవేట్ సంస్థగా స్విగ్గీ అవతరిస్తుంది.

గిగాబైట్స్ అనే వార్షిక టెక్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీ ఈ విషయాన్నివెల్లడించారు. తమ వృద్ధి అంచనాలు కొనసాగితే.. ఆర్మీ, రైల్వేల తరువాత దేశంలో మూడవ అతిపెద్ద ఉపాధి వనరుగా మారడానికి తమకు ఎన్నో ఏళ్లు పట్టదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రాబోయే 10-15 సంవత్సరాల్లో 100 మిలియన్ల కస్టమర్లు.. ప్రతి నెలా 15 రెట్లు తమ ప్లాట్‌ఫాంపై లావాదేవీలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీహర్ష చెప్పుకొచ్చారు.