చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్ క్యాప్సూల్

| Edited By:

Mar 09, 2019 | 9:52 PM

స్పేస్ ఎక్స్ వారి డ్రాగన్ క్యాప్సూల్ తన జర్నీని సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానమై ఐదు రోజుల పాటు తన మిషన్‌ని పూర్తి చేసి.. విజయవంతంగా నేల దిగింది.   Successful splashdown of the #CrewDragon right on time at 8:45 a.m. ET. pic.twitter.com/0qHhHzD4Js — NASA Commercial Crew (@Commercial_Crew) March 8, 2019 సరిగ్గా షెడ్యూల్ సమయానికే అట్లాంటిక్ మహాసముద్ర ఉపరితలంపై ల్యాండ్ అయిన ఆ […]

చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్ క్యాప్సూల్
Follow us on

స్పేస్ ఎక్స్ వారి డ్రాగన్ క్యాప్సూల్ తన జర్నీని సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానమై ఐదు రోజుల పాటు తన మిషన్‌ని పూర్తి చేసి.. విజయవంతంగా నేల దిగింది.

 

సరిగ్గా షెడ్యూల్ సమయానికే అట్లాంటిక్ మహాసముద్ర ఉపరితలంపై ల్యాండ్ అయిన ఆ పిక్చర్ పర్ఫెక్ట్ దృశ్యాన్ని ఒక చారిత్రాత్మక ఘటనగా పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది నాసా. నాలుగు కలర్‌ఫుల్ పారాచూట్ల నుంచి విడిపడి.. సురక్షితంగా భువి చేరిన డ్రాగన్‌ని GO సెర్చర్ అనే రికవరీ బోట్ ద్వారా భూమ్మీదకు తీసుకొచ్చేశారు.

సముద్ర ఉపరితలాన్ని తాకేటప్పుడు దీని వేగం 280 మైళ్ళు (450 కిలోమీటర్లు). డ్రాగన్ క్యాప్సూల్ వాతావరణంలోకి ప్రవేశించే సమయానికి దీని ఉష్ణోగ్రత 1600 సెల్సియస్ గా ఉంది. ఆరురోజుల ఈ టెస్ట్ ఫ్లైట్ అనేక అడ్డంకుల్ని దాటుకుని ఎట్టకేలకు విజవంతమైంది. కాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానమైన మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీకి చెందిన మిషన్ ఇదే కావడం గమనార్హం. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూవర్ ఎలోన్ మస్క్‌కి స్పేస్-X కంపెనీ సాధించిన ఘనతల్లో ఇదీ ఒకటి.