Whatsapp: వాట్సాప్‌లో మరో ఆకట్టుకునే ఫీచర్‌.. గ్రూప్‌ కాల్స్‌ కోసం ప్రత్యేకంగా…

|

Feb 28, 2022 | 8:15 AM

Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌లో (Apps) వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటకప్పుడు కొంగొత్త ఫీచర్లతో (Features) యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే...

Whatsapp: వాట్సాప్‌లో మరో ఆకట్టుకునే ఫీచర్‌.. గ్రూప్‌ కాల్స్‌ కోసం ప్రత్యేకంగా...
Whatsapp
Follow us on

Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌లో (Apps) వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటకప్పుడు కొంగొత్త ఫీచర్లతో (Features) యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు అంత క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పటికే ఎన్నో రకాల ఆకట్టుకునే ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జూమ్‌, గూగుల్‌ మీట్‌ వంటి యాప్స్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్‌ను వాట్సాప్‌లోనూ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.

గూగుల్‌ మీట్‌, జూమ్‌ వంటి యాప్స్‌లో గ్రూప్‌ కాల్స్‌ కోసం యూజర్లు లింక్‌ క్రియేట్‌ చేసి ఇతరులకు పంపించుకునే వెసులుబాటు ఉంటుందని తెలిసిందే. ప్రస్తుతం వాట్సాప్‌ కూడా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ ఇప్పటికే టెస్టింగ్‌ కూడా చేస్తోంది. దీంతో కాల్‌ హోస్ట్‌ చేసే వ్యక్తి లింక్‌ క్రియేట్‌ చేసి ఇతరులకు పంపొచ్చన్నమాట.

కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వారిని కూడా ఇన్వైట్‌ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఇలా వాట్సాప్‌ ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిస్తూ, తమ యూజర్లు చేయి జారిపోకుండా జాగ్రత్త పడుతోందీ టెక్ దిగ్గజం.

Also Read: Gallbladder Stone: గాల్ బ్లాడర్‌లో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..

Viral Video: తగ్గేదేలే అంటున్న ఐటీ మినిస్టర్.. కర్రసాముతో అదరగొట్టేశారు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!

Viral Video: తగ్గేదేలే అంటున్న ఐటీ మినిస్టర్.. కర్రసాముతో అదరగొట్టేశారు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!