చైనాలో వినియోగంలోకి ‘5G’ సేవలు

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 9:03 PM

టెక్నాలజీ విషయంలో కొంత కాలంగా అతి వేగంగా పరిగెడుతున్న చైనా మరో అరుదైన ఘనత సాధించింది. 5G సేవలు వినియోగిస్తున్న తొలి జిల్లాగా చైనాలోని షాంఘై రికార్డు సృష్టించింది. జపాన్, జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో ఇవి ఇంకా అమలు దశలోనే ఉన్నాయి. కాగా చైనా వీటిని అధిగమించి వినియోగంలోకి తీసుకువచ్చింది. చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక ‘చైనా డైలీ’ తెలిపిన ప్రకారం.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టెలికాం సంస్థ ‘చైనా మొబైల్‌’ 5G నెట్‌ వర్క్‌ […]

చైనాలో వినియోగంలోకి 5G సేవలు
Follow us on

టెక్నాలజీ విషయంలో కొంత కాలంగా అతి వేగంగా పరిగెడుతున్న చైనా మరో అరుదైన ఘనత సాధించింది. 5G సేవలు వినియోగిస్తున్న తొలి జిల్లాగా చైనాలోని షాంఘై రికార్డు సృష్టించింది. జపాన్, జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో ఇవి ఇంకా అమలు దశలోనే ఉన్నాయి. కాగా చైనా వీటిని అధిగమించి వినియోగంలోకి తీసుకువచ్చింది.

చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక ‘చైనా డైలీ’ తెలిపిన ప్రకారం.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టెలికాం సంస్థ ‘చైనా మొబైల్‌’ 5G నెట్‌ వర్క్‌ ట్రయల్‌ రన్‌ను అధికారికంగా షాంఘై జిల్లాలో శనివారం నుంచి ప్రారంభించిందని పేర్కొంది. గత మూడు నెలల కాలంలో షాంఘైలోని వివిధ చోట్ల 5G బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది…దీంతో జిల్లా మొత్తం 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చినట్లైందని ఆ కథనంలో పేర్కొంది.