చేపలు, తేనెటీగలు మాట్లాడతాయా..?

| Edited By: Anil kumar poka

Mar 22, 2019 | 7:01 PM

మొట్టమొదటిసారిగా తేనెటీగలు, చేపలు ఒకదానితో మరొకటి మాట్లాడుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. దీని కోసం వినూత్న రాడికల్ రోబో అనే కొత్త పరికరాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ రోబో సహాయంతో చేపలు, తేనెటీగలు ఒకదానితో మరొకటి మాట్లడుకోవడానికి వీలుంటుంది. ఈ రాడికల్ రోబో వ్యవస్థ గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం. పక్షుల బయో సిగ్నల్స్ బట్టి వాటిని గుర్తించడం, వాటి ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోవడం వంటి విషయాలు ఈజీగా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. తేనెటీగల్లో కూడా వీటిని […]

చేపలు, తేనెటీగలు మాట్లాడతాయా..?
Follow us on

మొట్టమొదటిసారిగా తేనెటీగలు, చేపలు ఒకదానితో మరొకటి మాట్లాడుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. దీని కోసం వినూత్న రాడికల్ రోబో అనే కొత్త పరికరాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ రోబో సహాయంతో చేపలు, తేనెటీగలు ఒకదానితో మరొకటి మాట్లడుకోవడానికి వీలుంటుంది.

ఈ రాడికల్ రోబో వ్యవస్థ గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం. పక్షుల బయో సిగ్నల్స్ బట్టి వాటిని గుర్తించడం, వాటి ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోవడం వంటి విషయాలు ఈజీగా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. తేనెటీగల్లో కూడా వీటిని ప్రవేశపెట్టారు. అలాగే.. ఇప్పుడు కొత్తగా చేపల్లో వీటిని టెస్ట్ చేస్తున్నారు.

చేపలు, తేనటీగల సమూహాల్ని వేరు వేరుగా పెట్టి ఈ రెండు జాతుల మధ్య సంభాషణను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఎంబెడెడ్ రోబోటిక్ స్పై, టెర్మినల్‌ను కలిపి వీటి భాషను తెలుసుకునేందుకు ఉపయోగించారు. ఒక తేనెటీగల సమూహం, చేపల్లో స్విమ్మింగ్ చేసే యానిమేట్రానిక్ రోబోల బట్టి వాటి సంకేతాలను పట్టుకుని, మనకు అర్థమయ్యే భాషల్లో అనువదించారు శాస్త్రవేత్తలు.

రెండు వేర్వేరు జాతులు ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ చేయడానికి ఈ రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి అని.. న్యూ సైజెర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జీవశాస్త్రవేత్త సైమన్ గార్నియర్ చెప్పారు. కాగా.. ప్రస్తుతం వీటిని టెస్ట్ చేస్తున్నారని త్వరలోనే ఇవి మరింత వృద్ధి చెందుతాయని అన్నారు.

సుదూర వర్గాల మధ్య పరస్పర చర్యలను రోబోట్లు కలిగి ఉండవచ్చనే భావనకు ఇది రుజువు. ఈ పరిశోధనలు రోబోటిక్స్ ఇంజనీర్లు కొన్ని జంతు సమూహాల జీవసంబంధ సంకేతాలను సంగ్రహించే మార్గాలను అర్థం చేసుకోవడానికి వాటికి అనుగుణంగా సహాయపడతాయి. కొన్ని జంతువులు ఎలా సంఘర్షణ చెందుతాయో అవగాహన చేసుకోవడానికి ఇది మరింత సహాయపడతాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.

ఈ అధ్యయనం ద్వారా భవిష్యత్తులో మరింత రోబోట్ సాంకేతిక పరిజ్ఞానం మొక్క పురోగతి చెందుతుందన్నారు. జంతువుల జీవితాలను అర్థం చేసుకుకోవడానికి ఈ కృత్రిమ రోబోట్లను అభివృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుంది. కొన్ని సమస్యల నుంచి, పొంచిఉన్న ముప్పు గురించి జంతువులను వీటి ద్వారా కాపాడడానికి ఈ రోబోట్‌లు ఎంతగానో సహకరిస్తాయి.