జియో నుంచి యూపీఐ సర్వీసు.. ఇక G-Pay, ఫోన్ పే, Paytmలకు కష్టమే..!

| Edited By:

Jan 21, 2020 | 1:32 PM

జియో తమ వినియోగదారులకు మరో సర్వీసును అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ఇతర ఆపరేటర్లకు గట్టిపోటీనిస్తూ.. టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పడు మరో సర్వీసును వినియోగదారులకు పరిచయం చేస్తూ.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సర్వీసులకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దిశగా అడుగులు వేస్తూ.. యూపీఐ పేమెంట్ సర్వీసును ప్రారంభించింది. ఇప్పటికే పలు సెలక్టెడ్ జియో యాప్‌లలో ఈ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. జియో యూపీఐ.. […]

జియో నుంచి యూపీఐ సర్వీసు.. ఇక G-Pay, ఫోన్ పే, Paytmలకు కష్టమే..!
Follow us on

జియో తమ వినియోగదారులకు మరో సర్వీసును అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ఇతర ఆపరేటర్లకు గట్టిపోటీనిస్తూ.. టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పడు మరో సర్వీసును వినియోగదారులకు పరిచయం చేస్తూ.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సర్వీసులకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దిశగా అడుగులు వేస్తూ.. యూపీఐ పేమెంట్ సర్వీసును ప్రారంభించింది. ఇప్పటికే పలు సెలక్టెడ్ జియో యాప్‌లలో ఈ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. జియో యూపీఐ.. ఇప్పుడు గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్‌కు గట్టిపోటీ కానుంది. మై జియో యాప్‌లో.. యూపీఐ ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆప్షన్ కలిగిన జియో యాప్ వినియోగదారులకు.. వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ) ఐడీ వస్తుంది. దీనికోసం జియో ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి బ్యాంకులను.. ఈ ఫ్లాట్‌ఫాంపైకి తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది.

జియో యూపీఐ క్రియేట్ చేయడం…

జియో యూపీఐ పేమెంట్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత.. యూజర్లకు ఒక వీపీఏ అడ్రస్ వస్తుంది. అనంతరం బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసిన తర్వాత.. యూజర్లు తమ మొబైల్ నంబరు, డెబిట్ కార్డు నంబరును ఎంటర్ చేయడం ద్వారా.. యూపీఐ పిన్ నంబర్ జనరేట్ అవుతుంది. పిన్ జనరేట్ అయితన తర్వాత.. గూగుల్ పే, ఫోన్ పే నుంచి అన్ని బ్యాంకులకు లావాదేవీలు ఎలా జరుపుతామో.. అలానే జరుపుకొవచ్చు.