‘మొబైల్ యాప్’ల ద్వారా ఫేస్‌బుక్‌కు సమాచార౦

| Edited By: Srinu

Mar 06, 2019 | 8:07 PM

స్మార్ట్‌ఫోన్‌లో పలు యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు చేరవేస్తున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్ గుర్తించింది. యూజర్ల నెలసరి వివరాలు, శరీర బరువు, షాపింగ్‌ వివరాలు వంటి వివరాలను వినియోగదారులకు తెలియకుండా ఫేస్‌బుక్‌కు పంపిస్తున్నాయని ఈ జర్నల్‌ తెలిపింది. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన టూల్‌ ద్వారా ఈ విషయాన్ని గుర్తించినట్లు జర్నల్‌ తెలిపింది. ఫేస్‌బుక్‌ వినియోగదారులు కాని వారి వ్యక్తిగత సమాచారాన్ని సైతం ఆయా యాప్‌లు ఫేస్‌బుక్‌కు పంపుతున్నాయి. దీనిపై ఫేస్‌బుక్‌ ప్రతినిధి నిస్సా ఆంక్లేసేరియా మాట్లాడుతూ..‘వినియోగదారుల […]

మొబైల్ యాప్ల ద్వారా ఫేస్‌బుక్‌కు సమాచార౦
Follow us on

స్మార్ట్‌ఫోన్‌లో పలు యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు చేరవేస్తున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్ గుర్తించింది. యూజర్ల నెలసరి వివరాలు, శరీర బరువు, షాపింగ్‌ వివరాలు వంటి వివరాలను వినియోగదారులకు తెలియకుండా ఫేస్‌బుక్‌కు పంపిస్తున్నాయని ఈ జర్నల్‌ తెలిపింది. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన టూల్‌ ద్వారా ఈ విషయాన్ని గుర్తించినట్లు జర్నల్‌ తెలిపింది. ఫేస్‌బుక్‌ వినియోగదారులు కాని వారి వ్యక్తిగత సమాచారాన్ని సైతం ఆయా యాప్‌లు ఫేస్‌బుక్‌కు పంపుతున్నాయి.

దీనిపై ఫేస్‌బుక్‌ ప్రతినిధి నిస్సా ఆంక్లేసేరియా మాట్లాడుతూ..‘వినియోగదారుల సమాచారాన్ని ఆయా యాప్‌ల నుంచి స్వీకరించినప్పుడు వ్యక్తిగత సమాచారం కూడా వస్తోంది. ఇందులో ఫేస్‌బుక్‌ ప్రమేయం లేదు. ఇలా కొన్ని యాప్‌లు మాకు వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని పంపుతుండటం గమనించాం. దీన్ని నివారించడానికి మేం చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికే ఆయా యాప్‌లకు ఈ విషయంలో షరతులు విధించాం. మా వద్ద ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని తొలగించే పనిలో ఉన్నాం’ అని తెలిపారు.