ఇక గగన్‌యాన్… రోదసీలోకి భారతీయుడు: ఇస్రో శివన్

| Edited By:

Sep 22, 2019 | 1:37 PM

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఇంకా దొరకలేదని, చంద్రయాన్ 2 ప్రయోగం 98 శాతం విజయం సాధించిందని ఇస్రో చైర్మన్ శివన్ శనివారం తెలిపారు. సిగ్నల్స్ దొరకకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లుచెప్పారు. ల్యాండర్‌లో ఏం జరిగిందో గుర్తిస్తామన్నారు. చంద్రయాన్ 2లో రోవర్లు మొరాయించినప్పటికీ, ఆర్బిటర్ అద్భుతంగా పని చేస్తోందన్నారు. అదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు. వచ్చే ఏడాది చంద్రుడి వద్దకు మరో ప్రయోగాన్ని చేపట్టే అవకాశముందని చెప్పారు. గగన్‌యాన్‌‌లో భాగంగా 2012 డిసెంబర్‌లో రోదసీలోకి […]

ఇక గగన్‌యాన్... రోదసీలోకి భారతీయుడు: ఇస్రో శివన్
Follow us on

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఇంకా దొరకలేదని, చంద్రయాన్ 2 ప్రయోగం 98 శాతం విజయం సాధించిందని ఇస్రో చైర్మన్ శివన్ శనివారం తెలిపారు. సిగ్నల్స్ దొరకకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లుచెప్పారు. ల్యాండర్‌లో ఏం జరిగిందో గుర్తిస్తామన్నారు. చంద్రయాన్ 2లో రోవర్లు మొరాయించినప్పటికీ, ఆర్బిటర్ అద్భుతంగా పని చేస్తోందన్నారు. అదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు. వచ్చే ఏడాది చంద్రుడి వద్దకు మరో ప్రయోగాన్ని చేపట్టే అవకాశముందని చెప్పారు.

గగన్‌యాన్‌‌లో భాగంగా 2012 డిసెంబర్‌లో రోదసీలోకి భారతీయుడిని పంపించేందుకు కసరత్తు చేస్తున్నట్లు శివన్ తెలిపారు. చంద్రుడిపై 14 రోజుల పాటు ఉండే పగటి సమయంలో మాత్రమే ల్యాండర్, రోవర్లు పని చేస్తాయని, ఆ పగటి సమయం శనివారంతో ముగిసిందని చెప్పారు.
విక్రమ్ వైఫల్యాల ప్రభావం గగన్‌యాన్ పైన ఉండదని శివన్ చెప్పారు. గగన్‌యాన్‌లో భాగంగా వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి తొలి మానవరహిత యాత్రను నిర్వహిస్తామని, 2021 జూలైలో రెండో యాత్రను చేపడతామని, అదే ఏడాది డిసెంబర్ నెలలో మన సొంత రాకెట్లో తొలి భారతీయుడిని రోదసీలోకి పంపిస్తామని చెప్పారు. భవిష్యత్తుపై చర్చిస్తున్నామని, గగన్‌యాన్ పైన దృష్టి సారించామన్నారు. శనివారం ఐఐటీ భువనేశ్వర్‌లో నిర్వహించిన ఎనిమమిదో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.