Google Gemini: ‘హే గూగుల్‌’ ఇప్పుడు మరింత కొత్తగా.. ఈ మార్పును గమనించారా.?

|

Jul 18, 2024 | 2:31 PM

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ హవా నడుస్తోంది. ఏఐ ఆధారిత చాట్‌ బాట్స్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. దీంతో ప్రతీ ఒక్కరూ తమకంటూ ఒక సొంత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను జోడిస్తున్నారు. చాట్‌ జీపీటీతో మొదలైన ఈ రేసు కొనసాగుతోనే ఉంది...

Google Gemini: హే గూగుల్‌ ఇప్పుడు మరింత కొత్తగా.. ఈ మార్పును గమనించారా.?
Google Gemini
Follow us on

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ హవా నడుస్తోంది. ఏఐ ఆధారిత చాట్‌ బాట్స్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. దీంతో ప్రతీ ఒక్కరూ తమకంటూ ఒక సొంత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను జోడిస్తున్నారు. చాట్‌ జీపీటీతో మొదలైన ఈ రేసు కొనసాగుతోనే ఉంది.

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్.. జెమినీ పేరుతో ఏఐ సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హే గూగుల్ లేదా ఓకే గూగుల్‌ అనే కమాండ్‌ సహాయంతో కావాల్సిన సమాచారాన్ని ఆడియో, టెక్ట్స్‌ రూపంలో అందించే అవకాశాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు యూజర్లు ఈ సదుపాయం పొందాలనే స్క్రీన్ లాక్‌ ఓపెన్‌ చేసిన తర్వాత కమాండ్ ఇవ్వాల్సి ఉండేది. అయితే ఇప్పుడు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో ఇకపై యూజర్లు లాక్‌ స్క్రీన్‌ ఓపెన్ చేయకుండానే కొన్ని ప్రశ్నలు అడగొచ్చు.

ఈ కొత్త ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌ లాక్‌లో ఉన్నా.. హే గూగుల్‌ లేదా ఓకే గూగుల్‌ అనే కమాండ్ ద్వారా జెమినీని యాక్సెస్‌ చేసుకోవచ్చు. వాయిస్‌ కమాండ్‌ లేదా చాటాబ్‌లో మీకు కావాల్సిన సమాచారాన్ని టైప్‌ చేసి సమాధానం పొందొచ్చు. అయిఏ కొన్ని టాస్స్‌లకు మాత్రం లాక్‌ ఓపెన్‌ చేయాల్సి ఉంటుందని గూగుల్‌ చెబతోంది.

అయితే యూజర్లు ఈ ఫీచర్‌ను మాన్యువల్‌గా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా జెమినీ మొబైల్‌ యాప్‌ ఓపెన్‌ చేసి ప్రొఫైల్‌ పిక్చర్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం అందులో జెమినీ అన్‌ లాక్‌ స్క్రీన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి రెస్పాన్స్‌ అన్‌ లాక్‌ స్క్రీన్‌ను ఆన్‌/ఆఫ్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ అసిస్టెంట్‌ సహకారంతో జెమినీని యాక్సెస్‌ చేయాలనుకుంటే సెట్టింగ్స్‌లోని గూగుల్‌ అసిస్టెంట్‌ ఫీచర్స్‌ ఇన్‌ జెమినీ క్లిక్‌ చేసి.. గూగుల్‌ అసిస్టెంట్‌ అన్‌ లాక్‌ స్క్రీన్‌ యాక్టివేట్‌ చేసుకోవాలి. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే ఆఫ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..