ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని మండే సూర్యుడి అద్భుత చిత్రాలు..

| Edited By:

Jul 17, 2020 | 1:14 PM

ఈ విశ్వంలో అంతు చిక్కని రహస్యం సూర్యుడు. ఇప్పటికే ఎన్నో దేశాలు భగ భగ మండే సూర్యుడి గురించి తెలుసుకునేందుకు చాలా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. భూమికి నుంచి 15 కోట్ల కిలో మీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు. అసలు సూర్యుడి దరిదాపుల్లోకి..

ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని మండే సూర్యుడి అద్భుత చిత్రాలు..
Follow us on

ఈ విశ్వంలో అంతు చిక్కని రహస్యం సూర్యుడు. ఇప్పటికే ఎన్నో దేశాలు భగ భగ మండే సూర్యుడి గురించి తెలుసుకునేందుకు చాలా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. భూమికి నుంచి 15 కోట్ల కిలో మీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు. అసలు సూర్యుడి దరిదాపుల్లోకి వెళ్లడమే ఓ సవాలు. కాగా ఏడాది ఫిబ్రవరి 9న సోలార్ ఆర్బిటర్‌ను అంతరిక్షంలోకి పంపించగా.. అది నాలుగు నెలల తర్వాత సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లింది. ఆ సమయంలో తీసిన చిత్రాలే ఇప్పుడు బయటకొచ్చాయి. వాటిని నాసా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

అయితే వీటిని చూసిన శాస్త్రవేత్తలు ఇంతకుముందు ఎప్పుడూ ఇంత దగ్గర చిత్రాలు చూడలేదని పేర్కొంటున్నారు. సూర్యుడికి అతి దగ్గర నుంచి తీసిన ఈ చిత్రాలు ఇంతకు ముందెప్పుడూ మనం చూడలేనివి. ఇవి సూర్యుడి వాతావరణ పొరలకు సంబంధించినవి. సూర్యుడిపై మరిన్ని అధ్యయనాలు చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ సమయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని మేము అనుకోలేదు. ఇంకా సూర్యుడికి సంబంధించిన ఎన్నో విషయాలను సోలార్ ఆర్బిటర్ భూమికి చేరవేస్తుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.