అంతరిక్షంలో నాసా వ్యవసాయం : ఏం పడించబోతోందో తెలుసా..?

| Edited By:

Jul 19, 2019 | 8:25 AM

అంతరిక్షంపైన ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకూ ఆసక్తి ఎక్కువే. కాగా.. అంతరిక్షంలో నీరు.. ఉన్నాయని.. అక్కడ మానవులు నివసించవచ్చని ఇదివరకే నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్షంలో గాలిపీల్చుకోవడమే కష్టం కాదా..! అలాంటిది.. అంతరిక్షంలో మొక్కల్ని పెంచడం కష్టమైన పనే.. దాదాపు అసాధ్యం.. అలాంటిది నాసా శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పటికే క్యాబేజీ, ముల్లంగి లాంటి మొక్కల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాగుచేసింది. అవి విజయవంతంగా పెరిగాయి. దీంతో.. నాసా తన నెక్ట్స్ అంతరిక్ష పంటగా […]

అంతరిక్షంలో నాసా వ్యవసాయం : ఏం పడించబోతోందో తెలుసా..?
Follow us on

అంతరిక్షంపైన ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకూ ఆసక్తి ఎక్కువే. కాగా.. అంతరిక్షంలో నీరు.. ఉన్నాయని.. అక్కడ మానవులు నివసించవచ్చని ఇదివరకే నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్షంలో గాలిపీల్చుకోవడమే కష్టం కాదా..! అలాంటిది.. అంతరిక్షంలో మొక్కల్ని పెంచడం కష్టమైన పనే.. దాదాపు అసాధ్యం.. అలాంటిది నాసా శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పటికే క్యాబేజీ, ముల్లంగి లాంటి మొక్కల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాగుచేసింది. అవి విజయవంతంగా పెరిగాయి. దీంతో.. నాసా తన నెక్ట్స్ అంతరిక్ష పంటగా ఎస్పానోలాకు చెందిన ‘చిల్లీ పెప్పర్‌’ను పెంచానుకుంటుంది. ‘చిల్లీ పెప్పర్‌’ అంటే తెలుగులో ‘మిరపకాయలు’ అన్నమాట. రోదసిలో పెంచడానికి ఎంచుకునే మొక్కలకు బొగ్గుపులుసువాయువు అంటే కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉండే చోట్ల.. మనుగడ సాగించగలిగే సామర్థ్యం ఉండాలి. చిల్లీలో కార్బన్ డై ఆక్సైడ్‌ను తట్టుకుని నిలిచే గుణం పుష్కలంగా ఉంటుంది. అందుకే.. నాసా శాస్త్రవేత్తలు ఈ మిరప పంటను ఎంచుకుంది. అంతరిక్షంలో ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. మార్స్, చందమామపై కూడా వీటిని మరోసారి ప్రయోగిస్తారు. చూడాలి మరి ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో..!