Psyche 16 asteroid: ఈ గ్రహశకలాన్ని భూమిపైకి తెస్తే… ప్రతీ ఒక్కరూ లక్షాధికారి కావొచ్చు.

|

Oct 12, 2023 | 7:39 PM

ఈ గ్రహశకలంపై ఉన్న రహస్యాలను చేధించేందుకు గాను నాసా ఓ మిషన్‌ను చేపట్టింది. ప్రస్తుతం ఈ మిషన్‌ గ్రహశకలానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ లోహ గ్రహశకలంలో 10,000 క్వాడ్రియన్‌ డాలర్లకు సమానమైన ఇనుము, నికెల్, బంగారం ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఒక క్వాడ్రియన్‌ రూ. 7,44,045తో సమానం. ఈ లెక్కన 10,000 క్వాడ్రియన్‌లు అంటే...

Psyche 16 asteroid: ఈ గ్రహశకలాన్ని భూమిపైకి తెస్తే... ప్రతీ ఒక్కరూ లక్షాధికారి కావొచ్చు.
Psyche 16 Asteroid
Follow us on

ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలకు నెలవు. మానవ మేథస్సు ఎంతలా అభివృద్ధి చెందుతున్నా, ఖగోళాంతరంలో ఉన్న ఎన్నో రహస్యాలను చేధిస్తున్నా ఇప్పటికీ ఎన్నో రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇలాంటి రహస్యాల్లో 16 సైక్‌ అనే గ్రహ శకలం ఒకటి. అంగారక గ్రహం, బృహస్పతి మధ్య ఉన్న 16 సైక్‌ అనే భారీ లోహ గ్రహశకలాన్ని చేధించే పనిలో పడింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (నాసా).

ఈ గ్రహశకలంపై ఉన్న రహస్యాలను చేధించేందుకు గాను నాసా ఓ మిషన్‌ను చేపట్టింది. ప్రస్తుతం ఈ మిషన్‌ గ్రహశకలానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ లోహ గ్రహశకలంలో 10,000 క్వాడ్రియన్‌ డాలర్లకు సమానమైన ఇనుము, నికెల్, బంగారం ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఒక క్వాడ్రియన్‌ రూ. 7,44,045తో సమానం. ఈ లెక్కన 10,000 క్వాడ్రియన్‌లు అంటే ఎన్ని లక్షల కోట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిపైకి వస్తే పండ పండినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ గ్రహశకలంపై లభించే విలువైన ఇనుము, బంగారంతో భూమిపై ఉన్న ప్రతీ ఒక్కరూ లక్షాధికారి కావొచ్చు. ఇక నాసా తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహశకలం బంగాళాదుంప ఆకారంలో ఉంది. దీని వ్యాసం ఏకంగా 226 కిలోమీటర్లుగా ఉంది. సాధారణంగా ఏ గ్రహశకలమైనా రాతి లేదా మంచుతో నిండి ఉంటుంది. కానీ 16 సైక్‌ మాత్రం ఇనుము, బంగారంతో నిండి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ గ్రహశకలం చరిత్ర విషయానికొస్తే దీనిని అన్నీ బేల్ డి గ్యాస్పరిస్‌ అనే ఖగోళ శాస్త్రవేత్త 1852 మార్చి 17న గుర్తించారు.

గ్రీకు దేవత అయితన సైకీ పేరు మీద ఈ గ్రహశకలానికి 16 సైక్‌ అనే నామకరణం చేశారు. ఈ గ్రహశకలంపై నాసా పరిశోధనలు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. 2022లో పరిశోధనలు ప్రారంభించిన నాసా 2026 నాటికి ఈ గ్రహశకలంపైకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ ప్రయోగం 2023కి వాయిదా పడింది. ఈ వారంలో  సైక్‌ స్పేస్‌క్రాఫ్ట్ పేరుతో నాసా ప్రయోగాన్ని చేపట్టనుంది. మరి ఈ మిషన్‌ ఏమేర సక్సెస్‌ అవుతుందో చూడాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..