దిశ ఘటన ఎఫెక్ట్: 28 మందికి ఉరిశిక్ష ఖరారు..!

| Edited By:

Dec 10, 2019 | 9:34 PM

మధ్య ప్రదేశ్ ప్రభుత్వం.. రేపిస్టులపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ‘దిశ’ ఘటన కూడా కారణం కావచ్చు. దేశంలో.. అత్యాచారాలు జరుగుతోన్న రాష్ట్రాల్లో.. మధ్య ప్రదేశ్ కూడా ఒకటి. దీంతో.. గత రెండేళ్లలో.. ఇక్కడ జరిగిన అత్యాచార నిందితులకు ఈ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. ఏకంగా 28 మందిని ఉరి తీస్తున్నట్టు.. అధికారికంగా.. ప్రకటించింది. అంతేకాకుండా.. ఇకపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై కూడా కఠిన శిక్షలు అమలు పరుస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో.. అక్కడి ప్రజలు […]

దిశ ఘటన ఎఫెక్ట్: 28 మందికి ఉరిశిక్ష ఖరారు..!
Follow us on

మధ్య ప్రదేశ్ ప్రభుత్వం.. రేపిస్టులపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ‘దిశ’ ఘటన కూడా కారణం కావచ్చు. దేశంలో.. అత్యాచారాలు జరుగుతోన్న రాష్ట్రాల్లో.. మధ్య ప్రదేశ్ కూడా ఒకటి. దీంతో.. గత రెండేళ్లలో.. ఇక్కడ జరిగిన అత్యాచార నిందితులకు ఈ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. ఏకంగా 28 మందిని ఉరి తీస్తున్నట్టు.. అధికారికంగా.. ప్రకటించింది. అంతేకాకుండా.. ఇకపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై కూడా కఠిన శిక్షలు అమలు పరుస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో.. అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేసి.. సంబరాలు చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో కీచకుల చేతిలో అంత్యంత దారుణంగా.. హత్యాచారానికి గురైన.. దిశ ఘటనలో.. నిందితుల ఎన్‌కౌంటర్ అనంతరం.. దేశంలోని నేరాలు చేసిన వారికి ఉరిశిక్షలు అమలవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా… దిశ ఘటన హైదరాబాద్‌ వైపు చూసేలా చేసింది. అంతేకాకుండా.. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కూడా పలువురు ఎంపీలు ప్రశ్నించి.. ఆడవారిపై దాడులను అరికట్టారు. ఈ సమయంలోనే.. నిర్భయ ఘటన కూడా మరోసారి తెరపైకి వచ్చింది. వారికి కూడా ఈ నెల 16వ తేదీన ఉరిశిక్షను అమలు పరుస్తున్నట్టు సమాచారం.