నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన జీశాట్-30

| Edited By:

Jan 17, 2020 | 7:50 AM

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి.. ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా.. జీశాట్‌-30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించింది. 38 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి చేరడంతో.. పరీక్ష విజయవంతమైంది. ఈ ఉపగ్రహం బరువు 3357 కిలోలు.. కాగా ఇది ఓ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. ఇన్‌సాట్‌-4ఏ ఉపగ్రహానికి బదులుగా ఈ జీషాట్-30 సేవలను అందించనుంది. దీని ద్వారా కమ్యూనికేషన్ […]

నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన జీశాట్-30
Follow us on

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి.. ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా.. జీశాట్‌-30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించింది. 38 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి చేరడంతో.. పరీక్ష విజయవంతమైంది. ఈ ఉపగ్రహం బరువు 3357 కిలోలు.. కాగా ఇది ఓ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. ఇన్‌సాట్‌-4ఏ ఉపగ్రహానికి బదులుగా ఈ జీషాట్-30 సేవలను అందించనుంది. దీని ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. టెలివిజన్, టెలీ కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సేవలే లక్ష్యంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. భారత్‌కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం.. జీశాట్‌-30 ప్రయోగం విజయవంతమైనట్లుగా ఇస్రో తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.