ఇస్రో సాంకేతికతతో.. ఇండియన్ రైల్వేస్ ఆధునికీకరణ!

| Edited By:

Dec 07, 2019 | 6:54 PM

ఇక రైలు ఆలస్యం కావడం వల్ల, గంటలు గంటలు రైల్వే స్టేషన్ లో వేచిచూడాల్సిన అవసరం లేదు. రియల్ టైమ్ ట్రాకింగ్‌తో రైళ్ల గమనాన్ని నిర్ధారించడానికి ఇండియన్ రైల్వేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో చేతులు కలిపింది. రైళ్లలో రియల్ టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఆర్టీఐఎస్) ప్రాజెక్టును అమలు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్మ్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సిఆర్ఐఎస్) ఇస్రోతో చేతులు కలిపింది. రైలు […]

ఇస్రో సాంకేతికతతో.. ఇండియన్ రైల్వేస్ ఆధునికీకరణ!
Follow us on

ఇక రైలు ఆలస్యం కావడం వల్ల, గంటలు గంటలు రైల్వే స్టేషన్ లో వేచిచూడాల్సిన అవసరం లేదు. రియల్ టైమ్ ట్రాకింగ్‌తో రైళ్ల గమనాన్ని నిర్ధారించడానికి ఇండియన్ రైల్వేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో చేతులు కలిపింది. రైళ్లలో రియల్ టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఆర్టీఐఎస్) ప్రాజెక్టును అమలు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్మ్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సిఆర్ఐఎస్) ఇస్రోతో చేతులు కలిపింది. రైలు కదలికల డేటాను పొందటానికి భారతీయ రైల్వే జిపిఎస్ ఎయిడెడ్ జియో-ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ (గగాన్) ఆధారిత పరికరాలను ఏర్పాటు చేసింది. కొత్త నావిగేటింగ్ సిస్టమ్ సహాయంతో రైళ్ల రియల్ టైమ్ డేటాను ట్రాక్ చేయడం సులభతరమవుతుంది.

ముఖ్యంగా రైలు ప్రమాదాల సమయంలో ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. రైళ్ల యొక్క ఖచ్చితమైన స్థానాన్ని ఈ టెక్నాలజీ సహాయంతో తెలుసుకోవచ్చు. రిమోట్ సెన్సింగ్ సదుపాయంతో మానవరహిత లెవల్ క్రాసింగ్ లను పర్యవేక్షించడానికి ఈ కొత్త పరికరం రైల్వేలకు సహకరిస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్‌టిఐఎస్ ప్రాజెక్టు మొదటి దశలో 2600 కు పైగా రైళ్లలో రియల్ టైమ్ ట్రాకింగ్ పరికరాన్ని ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి పియూష్ గోయల్ లోక్‌సభలో తెలిపారు.

ఈ కొత్త జిపిఎస్ ఎనేబుల్డ్ ట్రాకింగ్ సిస్టమ్‌తో ప్రయాణికులందరికీ ఖచ్చితమైన రైళ్ల సమాచారాన్ని అందించాలని ఇండియన్ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. రైలు నియంత్రణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఆర్టీఐఎస్ వ్యవస్థ సహాయపడుతుంది. లోకోమోటివ్, కంట్రోల్ సెంటర్ మధ్య అత్యవసర సందేశం సులభతరమవుతుంది.