ఈ యాప్‌ల వాడకమే ఆరోగ్యానికి మహా భాగ్యం..!

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:21 PM

బెంగళూర్: టెక్నాలజీ భారీగా అభివృద్ధి చెందుతున్న ఈ మధ్యకాలంలో చాలామంది వ్యక్తులు ఆరోగ్యం బాగోలేకపోతే.. ప్రక్కన ఉన్న హాస్పిటల్స్ కి వెళ్లడం కన్నా తమ చేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్స్.. దానిలో ఉండే యాప్స్ ని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా హెల్త్ కు సంబంధించిన చాలా యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అందరూ కూడా తమ ఇంటి దగ్గర నుండే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో నుంచే మందులు కొనుగోలు చేస్తున్నారు.  ఇలాంటి యాప్స్ నిర్వహించే ఒక సంస్థ గురించి […]

ఈ యాప్‌ల వాడకమే ఆరోగ్యానికి మహా భాగ్యం..!
Follow us on

బెంగళూర్: టెక్నాలజీ భారీగా అభివృద్ధి చెందుతున్న ఈ మధ్యకాలంలో చాలామంది వ్యక్తులు ఆరోగ్యం బాగోలేకపోతే.. ప్రక్కన ఉన్న హాస్పిటల్స్ కి వెళ్లడం కన్నా తమ చేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్స్.. దానిలో ఉండే యాప్స్ ని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా హెల్త్ కు సంబంధించిన చాలా యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అందరూ కూడా తమ ఇంటి దగ్గర నుండే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో నుంచే మందులు కొనుగోలు చేస్తున్నారు.  ఇలాంటి యాప్స్ నిర్వహించే ఒక సంస్థ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డాక్పెర్.. అనే బెంగళూర్ కి చెందిన హెల్త్ కేర్ సంస్థ… ప్రతీ డాక్టర్స్ కు ఒక బ్లూ టూత్ అమర్చబడిన పెన్, నోట్ పాడ్ ఇస్తోంది. వాటి ద్వారా డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ ను ఫొటోస్ తీసి క్లౌడ్- బేస్డ్ సర్వేర్ లో భద్రపరుస్తారు కంపెనీ అధికారులు. దీనితో అపాయింట్మెంట్ తీసుకున్న వెంటనే రోగికి ఎస్ ఎమ్ ఎస్ ద్వారా తన ప్రిస్క్రిప్షన్ అందుతుంది.

కానీ ఇందులో ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే.. సదరు కంపెనీ డాక్టర్ చేత ఒక అగ్రిమెంట్ సైన్ చేయించుకుంటుంది. అదేంటంటే రోగి యెక్క సున్నితమైన మెడికల్ రికార్డ్స్ మొత్తం ఆ కంపెనీ చేతుల్లో పెట్టాలి. నిజం చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, సెక్షన్ 5 ప్రకారం ఇది నేరం.

ఇండియా లో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ (ఈఎమ్ఆర్) పెరుగుతున్న నేపథ్యంలో డాక్పెర్ సంస్థకు వారు వాడే బ్లూటూత్ పెన్ ఎంతో ఉపయోగకరం అనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఇలాంటి కంపెనీస్ మాత్రం మేము డాక్టర్స్ కు, రోగులకు వారి మెడికల్ హిస్టరీ మొత్తం సులభంగా పొందడానికి తోడ్పడుతున్నాం అని అంటారు. ఇక రోగులు అయితే మాత్రం వారి మెడికల్ హిస్టరీస్ ను లీగల్ గా ఇన్సూరెన్స్ ప్రీమియంస్ ద్వారా కంపెనీలు సేకరిస్తున్నాయి అని అనుకుంటున్నారు.

హార్వార్డ్ కు చెందిన ఆడమ్ టాన్నర్ ఈ విషయం పై స్పందిస్తూ పేషెంట్స్ అందరికి తమ మెడికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా అమ్ముడైపోతున్న విషయం అసలు తెలియదు. ఇలా సేకరించడం చాలా తప్పుడు చర్య అని ఆయన తెలిపారు.

2015 వ సంవత్సరంలో స్థాపించిన డాక్పెర్ సంస్థకు భారతదేశంలో ప్రముఖ ఆరోగ్య భీమా సంస్థల్లో ఒకరైన విడాల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి ఎక్కువ నిధులు వస్తాయట. డాక్పెర్ సంస్థకు చెందిన పరాగ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ విడాల్ హెల్త్ కేర్ కేవలం థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే. వారు ఎటువంటి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అమ్మరు అని ఆయన అన్నారు. అంతేకాదు మేము రోగులకు ఏ మందులు విక్రయించం. మా ప్రతీ రికార్డ్స్ పై డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటుంది. మేము రోగుల డేటా ఇతర కంపెనీస్ ఎవరికి విక్రయించం అని పేర్కొన్నారు.