Hike Messenger: ఈనెల 21 నుంచి నిలిచిపోనున్న హైక్‌ మెసెంజర్‌ సేవలు.. ప్రకటించిన సీఈవో కెవిన్‌ భారతి మిట్టల్‌

|

Jan 18, 2021 | 9:34 PM

Hike Messenger: భారత్‌లో ఎంతో ప్రజాదారణ పొందిన మెసేజింగ్‌ యాప్స్‌లో 'హైక్‌ మెసేంజర్‌' కూడా ఒకటి. గత ఎనిమిదేళ్ల కిందట హైక్‌ ప్రారంభమైంది. అయితే అతి తక్కువ ...

Hike Messenger: ఈనెల 21 నుంచి నిలిచిపోనున్న హైక్‌ మెసెంజర్‌ సేవలు.. ప్రకటించిన సీఈవో కెవిన్‌ భారతి మిట్టల్‌
Follow us on

Hike Messenger: భారత్‌లో ఎంతో ప్రజాదారణ పొందిన మెసేజింగ్‌ యాప్స్‌లో ‘హైక్‌ మెసేంజర్‌’ కూడా ఒకటి. గత ఎనిమిదేళ్ల కిందట హైక్‌ ప్రారంభమైంది. అయితే అతి తక్కువ కాలంలోనే హైక్‌ మెసెంజర్‌ ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత వాట్సాప్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు చేరువ కావడంతో హైక్‌కు ఆదరణ తగ్గిపోయింది. హైక్‌ స్టిక్కర్‌ చాట్స్‌ను అతి పెద్ద ఇండియన్‌ ఫ్రీవేర్‌, క్రాస్‌ -ప్లాట్‌ఫాం ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ అప్లికేషన్‌ కూడా పిలిచేవారు.

2016 ఆగస్టు నాటికి హైక్‌కు 100 మిలియన్ల రిజిస్టర్డ్‌ వినియోగదారులు ఉన్నారు. అలాగే పది ప్రాంతీయ భాషలను కూడా సపోర్టు చేసేది హైక్‌. ఇదిలా ఉండగా, ఒక కోటి యూజర్లతో ఉన్న హైక్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు హైక్‌ మెసెంజర్‌ యాప్‌ సీఈవో కెవిన్‌ భారతి మిట్టల్‌ ట్విటర్‌ వేదికగా ఈ నెల మొదటి వారంలో ప్రకటించారు. స్టిక్కర్‌ చాట్‌ యాప్‌ జనవరి 21తో నిలిచిపోనుంది. మాపై నమ్మకం ఉంచినందు ధన్యవాదాలు, మీరంతా లేకపోతే మేమిక్కడ ఉండే వాళ్లము కాదు.. అని ఆయన ట్విటర్‌లో తెలిపారు.

 

Also Read:

WhatsApp: మీ మేసేజ్‏లు ఎవరైనా చూస్తారని అనుమానపడుతున్నారా ? ఈ సెట్టింగ్స్ చేస్తే మీ వాట్సప్ భద్రమే ఇక..