Google Chrome: ఐదు కొత్త ఫీచర్లు.. గూగుల్ క్రోమ్ యూజర్లకు పండగే..

ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ పరికరాలలో గూగుల్ క్రోమ్ వాడే వినియోగదారుల కోసం ఐదు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. లోకల్ సెర్చ్ రిజల్ట్స్ కోసం కొత్త షార్ట్ కట్లు, సులభమైన నావిగేషన్ కోసం రీడిజైన్ చేసిన అడ్రస్ బార్ ను తీసుకొచ్చింది. అలాగే క్రోమ్ యాక్షన్స్ పేరిట తీసుకొచ్చిన ఫీచర్ లోకల్ బిజినెస్ ను మరింత సులభతరం చేయడంతో పాటు సమయాన్ని ఆదా చేస్తుంది.

Google Chrome: ఐదు కొత్త ఫీచర్లు.. గూగుల్ క్రోమ్ యూజర్లకు పండగే..
Google Chrome
Follow us

|

Updated on: Jun 30, 2024 | 4:57 PM

ఇంటర్ నెట్లో ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలన్నా.. సహజంగా ఏదైనా అంశంలో సందేహం కలిగినా వెంటనే గూగుల్ లో సెర్చ్ చేస్తాం. అందుకోసం అందరూ వినియోగించే ఇంజిన్ గూగుల్ క్రోమ్. వినియోగదారులకు గూగుల్ క్రోమ్ మంచి రిజల్ట్స్ అందిస్తూ అత్యధికంగా దానిని వినియోగించేలా చేస్తోంది. గూగుల్ దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటోంది. అందులో భాగంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ పరికరాలలో గూగుల్ క్రోమ్ వాడే వినియోగదారుల కోసం ఐదు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. లోకల్ సెర్చ్ రిజల్ట్స్ కోసం కొత్త షార్ట్ కట్లు, సులభమైన నావిగేషన్ కోసం రీడిజైన్ చేసిన అడ్రస్ బార్ ను తీసుకొచ్చింది. అలాగే క్రోమ్ యాక్షన్స్ పేరిట తీసుకొచ్చిన ఫీచర్ లోకల్ బిజినెస్ ను మరింత సులభతరం చేయడంతో పాటు సమయాన్ని ఆదా చేస్తుంది.

క్రోమ్ యాక్షన్స్..

గూగుల్ క్రోమ్ తీసుకొచ్చిన ఫీచర్లలో క్రోమ్ యాక్షన్స్ ఒకటి. దీని ద్వారా మీరు లోకల్ సెర్చింగ్ ను చాలా సులభతరం చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా హోటల్ కోసం వెతుకుంటే క్రోమ్ సెర్చ్ బార్ వద్ద కొత్తగా మూడు షార్ట్ కట్ బటన్స్ కనిపిస్తాయి. వాటి సాయంతో ఆ హోటల్ ఫోన్ నంబర్, రూట్ మ్యాప్, రివ్యూలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ వెర్షన్ కూడా యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

అడ్రస్ బార్ రీడిజైన్..

ఐప్యాడ్‌లు, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు వాటి పెద్ద స్క్రీన్ పరిమాణాల ప్రయోజనాన్ని పొందడానికి గూగుల్ క్రోమ్ అడ్రస్ బార్‌ను రీడిజైన్ చేసింది. గూగుల్ మెటీరియల్ యూ డిజైన్ లాంగ్వేజ్ కు అనుగుణంగా దీనిని రూపొందించింది. దీని సాయంతో మీరు ఏదైనా సెర్చ్ చేస్తుతన్నప్పుడు సెర్చ్ బార్ కిందనే డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. దీనిలో మీరు ఇంతకు ముందు చూసిన వెబ్ సైట్లు మీరు వెతుకున్న అంశానికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.

క్రోమ్ షెడ్యూల్స్..

ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలలోనూ పనిచేస్తుంది. మీరు తరచూ సెర్చ్ చేసే విషయాలు మీకు ముందుగా చూపిస్తుంది. గత సెర్చ్ ఆధారంగా మీకు షార్ట్ కట్ లను సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక వినియోగదారు తరచుగా సిటీ మెట్రో వెబ్‌సైట్‌ని సందర్శిస్తే.. వినియోగదారు “షెడ్యూల్స్” ప్రకారం మళ్లీ వేరేది ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్‌సైట్ సెర్చ్ సజెషన్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది.

ట్రెండింగ్ సెర్చెస్..

మరో ఉపయోగకరమైన ఫీచర్ ట్రెండింగ్ సెర్చెస్ ఫీచర్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఇప్పటి వరకూ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు యాపిల్ యూజర్లు సెర్చ్ బార్ పై క్లిక్ చేస్తే.. ఆ ప్రాంతంలో ట్రెండింగ్లో ఉన్న అంశాలు వారికి కనిపిస్తాయి.

స్పోర్ట్స్ కోసం..

గూగుల్ క్రోమ్ డిస్కవర్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ డిస్కవర్ ఫీడ్ లో కొత్త లైవ్ స్పోర్ట్స్ కార్డ్ లు కూడా ఇకపై కనిపించనున్నాయి. ఇక్కడ మీరు గతంలో వెతికన వార్తలు, స్పోర్ట్స్ సంబంధిత వివరాలు కపిస్తాయి. ఆట ఎలా జరుగుతోందనే దానిపై ఆటోమేటిక్ అప్‌డేట్‌లను సైతం అందిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..