Google Playstore: యూజర్ల భద్రతకు పెద్ద పీట వేస్తోన్న గూగుల్‌.. యాప్‌ డెవలపర్లకు సరికొత్త నిబంధనలు..

|

Jul 20, 2022 | 6:30 AM

Google Playstore: విమానం టికెట్‌ నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే వరకు ప్రతీ ఒక్క పనికి ఒక్క యాప్‌ అందుబాటులోకివచ్చింది. స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో...

Google Playstore: యూజర్ల భద్రతకు పెద్ద పీట వేస్తోన్న గూగుల్‌.. యాప్‌ డెవలపర్లకు సరికొత్త నిబంధనలు..
Follow us on

Google Playstore: విమానం టికెట్‌ నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే వరకు ప్రతీ ఒక్క పనికి ఒక్క యాప్‌ అందుబాటులోకివచ్చింది. స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో అన్ని పనులకు యాప్‌లను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌. దీంతో ప్లే స్టోర్‌లో లక్షలాది కొత్త యాప్స్‌ పుట్టుకొస్తున్నాయి. అయితే అన్ని అవసరాలను తీరుస్తోన్న యాప్స్‌ యూజర్ల భద్రతను మాత్రం ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునే సమయంలో అడిగే పర్మిషన్స్‌ యూజర్ల సమాచారాన్ని యాప్‌ నిర్వాహకులు చేతిలో పెడుతున్నాయి. దీంతో యూజర్ల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది.

దీంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి గూగుల్‌ సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం.. యూజర్లు యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో యాప్‌ డెవలపర్‌ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనే సమాచారాన్ని తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. యాప్‌ డెవలపర్స్‌ అందించిన సమాచారాన్ని గూగుల్‌ తనిఖీ చేసి ఆ సమాచారాన్ని ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచుతుంది.

యాప్‌ నిర్వాహకులు యూజర్ల డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యకలపాలు జరిపినా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటుంది. జులై 20 నుంచి డేటా సేఫ్టీ నిబంధనలను పాటించని యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తామని గూగుల్‌ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..