పాకెట్ సైజులో ప్రింటర్.. ఎప్పుడంటే అప్పుడే ప్రింటింగ్..

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2020 | 7:51 PM

సాధారణంగా ఏదైనా ఫొటో ప్రింట్ తీసుకోవాలంటే.. వెళ్లి ఫొటో దిగడం కానీ లేదంటే పాత పిక్స్‌ని ప్రింటింగ్ తీసుకోవడం చేస్తూంటాం. ఒక్కోసారి మనకు అస్సలు వీలు పడదు. అయినా అర్జెంట్ పని కోసం తప్పదు కాబట్టి ఫొటో స్టూడియోకి వెళ్తూంటాం. కానీ ఇక నుంచి ఆ శ్రమ అవసరం లేదు. ఫుజిఫిల్మ్ అనే సంస్థ భారత్‌లో ఇన్‌స్టాక్స్..

పాకెట్ సైజులో ప్రింటర్.. ఎప్పుడంటే అప్పుడే ప్రింటింగ్..
Follow us on

సాధారణంగా ఏదైనా ఫొటో ప్రింట్ తీసుకోవాలంటే.. వెళ్లి ఫొటో దిగడం కానీ లేదంటే పాత పిక్స్‌ని ప్రింటింగ్ తీసుకోవడం చేస్తూంటాం. ఒక్కోసారి మనకు అస్సలు వీలు పడదు. అయినా అర్జెంట్ పని కోసం తప్పదు కాబట్టి ఫొటో స్టూడియోకి వెళ్తూంటాం. కానీ ఇక నుంచి ఆ శ్రమ అవసరం లేదు. ఫుజిఫిల్మ్ అనే సంస్థ భారత్‌లో ఇన్‌స్టాక్స్ మినీ లింక్‌ను లాంచ్ చేసింది. ఇది పాకెట్ సైజులో ఉండే ఈ ఫొటో ప్రింటర్ ద్వారా మన ఫోన్ కెమెరా, ఫొటో లైబర్రీలోని ఫొటోలను క్రెడిట్ కార్డు సైజులో ప్రింట్ తీసుకోవచ్చు. ఇవి అమెజాన్, ఫ్లిప్‌కార్డ్‌లతో పాటు రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉండబోతున్నాయట. కానీ వీటిని వచ్చే వారం నుంచి కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది ఫుజిఫిల్మ్ సంస్థ. ప్రస్తుతం ఇవి యాష్ వైట్, డస్కీ పింక్, డార్క్ డెనిమ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ లింక్‌ను డెడికేటెడ్ యాప్‌ సహాయంతో బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా మనకిష్టమైన ఫొటోలను అప్పటికప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకధాటిగా 100 ఫొటోలను ప్రింట్ చేసుకోవచ్చు. ఇక ఈ పాకెట్ ఫొటో ప్రింటర్ రూ.9,999లకి లభ్యమవుతోంది.

Read More: 

ఆవిలింత రావడానికి అసలు కారణం..’ఆక్సిజన్’ అందకపోవడమేనట!

టెన్త్ ఎగ్జామ్స్‌ని మొత్తానికే రద్దు చేయండి.. మంచు హీరో వ్యాఖ్యలు

వకీల్ సాబ్ నుంచి న్యూ స్టిల్ లీక్.. నల్లకోటులో పవన్..