అమేజింగ్.. నదిలో పడిన ఐఫోన్: ఏడాది తర్వాత కూడా.. పనిచేస్తుంది

| Edited By:

Oct 01, 2019 | 11:16 AM

సాధారణంగా.. నీటిలో ఫోన్‌ పడితే.. మళ్లీ పనిచేయదు. కొన్ని వాటర్ ఫ్రూఫ్ అనుకుంటాము కానీ.. ఒక్కోసారి అవి కూడా పనిచేయవు. అలాంటిది.. ఏడాది క్రితం ఓ నదిలో.. ఫోన్ పడితే ఇంకేముంది. అది.. పనిచేయదు అని ఫిక్స్ అయిపోతారు. కానీ.. ఓ ఐఫోన్ ఏడాది క్రితం.. నీటిలో పడిపోయింది. అయినా అది పనిచేస్తుంది.. అంటే.. ఓ షాక్‌నే. యూట్యూబర్ మైకేల్ బన్నెట్ అనే.. ఓ ట్రెజర్ హంటర్.. నదిలో.. పడిని వస్తువుల్ని వెతుకుతూ వుండగా… ఐఫోన్ కనిపించింది. […]

అమేజింగ్.. నదిలో పడిన ఐఫోన్: ఏడాది తర్వాత కూడా.. పనిచేస్తుంది
Follow us on

సాధారణంగా.. నీటిలో ఫోన్‌ పడితే.. మళ్లీ పనిచేయదు. కొన్ని వాటర్ ఫ్రూఫ్ అనుకుంటాము కానీ.. ఒక్కోసారి అవి కూడా పనిచేయవు. అలాంటిది.. ఏడాది క్రితం ఓ నదిలో.. ఫోన్ పడితే ఇంకేముంది. అది.. పనిచేయదు అని ఫిక్స్ అయిపోతారు. కానీ.. ఓ ఐఫోన్ ఏడాది క్రితం.. నీటిలో పడిపోయింది. అయినా అది పనిచేస్తుంది.. అంటే.. ఓ షాక్‌నే. యూట్యూబర్ మైకేల్ బన్నెట్ అనే.. ఓ ట్రెజర్ హంటర్.. నదిలో.. పడిని వస్తువుల్ని వెతుకుతూ వుండగా… ఐఫోన్ కనిపించింది. చూడగా.. అది ఇంకా పనిచేస్తోంది. దాన్ని చూసిన యూట్యూబర్ మైకేల్ బన్నెట్ దాన్ని చూసి షాక్ అయ్యాడు.

ఏడాది క్రితం అమెరికా.. సౌత్ కరోలినాలోని ఎడిస్టో నదిలో పడిపోయింది. ఈ విషయం తెలియని బన్నెట్ ఎప్పటిలాగే.. నదిలో ట్రెజర్ కోసం.. మెటల్ డిటెక్టర్ ద్వారా వెతుకుతూ వుంటే.. ఐఫోన్ తగిలింది. ఇది చూసి షాకైన బన్నెట్.. అది పనిచేస్తోందని.. ఎక్స్‌ప్లైన్ చేస్తూ.. వీడియో తీశాడు. దాన్ని తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాడు. కొన్ని గంటల్లో దానికి లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో.. ఈ వీడియో వైరల్ అయ్యింది. అంతేకాదు. ఆఫోన్‌‌ను జాగ్రత్తగా అతని ఓనర్‌కి అందించాడు. అది ఎరికా బెన్నెట్ అనే మహిళది. ఆమె 2018 జూన్ 19న ఫ్యామిలీ ట్రిప్‌తో వెళ్తుండగా ఫోన్‌ని పోగొట్టుకుంది. ఫోన్ పోయిందనుకున్న ఆమె.. ఫోన్ తిరిగి రావడంతో.. ఎంతో సంతోషించింది.