Smartphone: స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి

|

May 19, 2024 | 7:14 AM

ఇందుకోసం ముందుగా మీరు ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌ల జాబితాను చూడడానికి స్టోరేజ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం అక్కడ ఉన్న యాప్‌లపై క్లిక్‌ చేయాలి. ఇక్కడ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయి ఉన్న యాప్స్‌ వివరాలతో పాటు, అవి ఎంత స్పేస్‌ను ఆక్రమించాయన్నవివరాలు ఉంటాయి. ఎక్కువ స్పేస్‌ తీసుకున్న..

Smartphone: స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
Smart Phone Slow
Follow us on

సాధారణంగా ఏస్మార్ట్ ఫోన్‌ అయినా కొన్ని రోజులు వాడిన తర్వాత సహజంగానే వేగం నెమ్మదిస్తుంది. ఫోన్‌ పర్ఫ్మమెన్స్‌లో వేగం కచ్చితంగా తగ్గుతుంది. స్టోరేజ్‌ నిండడమో, యాప్స్‌ ఎక్కువ కావడమో ఫోన్‌ స్లోగా మారడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఫోన్‌లో మాల్వేర్‌ ఉన్నా, ఫోన్‌ హ్యాక్‌కి గురైనా కూడా స్లో అవుతుంది. అయితే ఫోన్‌ స్లోగా మారిన సమయంలో కొన్ని సింపుల్‌ ట్రిక్క్‌ ఫాలో అయితే ఫోన్‌ వేగాన్ని మళ్లీ పెంచుకోవచ్చు. ఇంతకీ ఆ ట్రిక్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందుకోసం ముందుగా మీరు ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌ల జాబితాను చూడడానికి స్టోరేజ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం అక్కడ ఉన్న యాప్‌లపై క్లిక్‌ చేయాలి. ఇక్కడ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయి ఉన్న యాప్స్‌ వివరాలతో పాటు, అవి ఎంత స్పేస్‌ను ఆక్రమించాయన్నవివరాలు ఉంటాయి. ఎక్కువ స్పేస్‌ తీసుకున్న యాప్‌ల క్యాచ్‌ మెమొరీని క్లియర్ చేయాల్సి ఉంటుంది.

ఇలా క్యాచ్‌ మెమోరీని క్లియర్‌ చేస్తే ఫోన్‌లోని ర్యామ్‌పై లోడ్ తగ్గుతుంది దీంతో ఫోన్‌ వేగంగా పనిచేస్తుంది. ఒకవేళ ఇలా చేసిన తర్వాత కూడా ఫోన్‌ వేగంగా పనిచేయకపోతే.. మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసే ముందు, మీ ఫోన్‌లో ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉందో లేదో చూసుకోవాలి. అలాగే వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌కు కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది.

ఒకవేళ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసినా ఫోన్‌ వేగం పెరగకపోతే సేఫ్‌ మోడ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌ పవర్‌ బట్‌ను నొక్కి పట్టుకోవాలి. అనంతరం స్క్రీన్‌పై ఫోన్‌ రీస్టార్ట్ ఆప్షన్‌ కనిపిస్తుంది. తర్వాత ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ బటన్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేయాలి. ఇక్కడ సేఫ్‌ మోడ్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. సేఫ్ మోడ్‌లో ఫోన్‌ను ఆన్ చేసిన తర్వాత మీ ఫోన్ వేగంగా పనిచేయడం ప్రారంభిస్తే, ఫోన్‌లోని ఏదో యాప్‌ వేగాన్ని తగ్గిస్తుందని అర్థం చేసుకోవాలి. ఫోన్‌ స్లో అవ్వడానికి కారణమైన యాప్‌ను తొలగించాలి. ఇన్నీ చేసినా ఫోన్‌ స్లోగానే ఉంటే.. ఫ్యాక్టరీ రీసెట్ ఒకటే మిగిలిన ఆప్షన్‌.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..