UPI: యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా.? ఇవి గుర్తుపెట్టుకోండి..

|

Jun 10, 2024 | 8:56 AM

ఇక ఎక్కడ టెక్నాలజీ పెరుగుతుంతో అక్కడ నేరాలు కూడా పెరగడం కామన్‌. అలాగే యూపీఐ పేమెంట్స్‌లో కూడా ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు సైబర్‌ నేరస్థులు యూపీఐ పేమెంట్స్ ద్వారా మోసాలకు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. అయితే ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని రకాల టిప్స్‌ను...

UPI: యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా.? ఇవి గుర్తుపెట్టుకోండి..
Upi Payments
Follow us on

యూపీఐ పేమెంట్స్‌కు ఎంతలా ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా డెవలప్‌ చేసిన ఈ విధానం భారత్‌లో సక్సెస్‌ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ సేవలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. పెద్దపెద్ద దుకాణాల నుంచి చిన్న చిన్న టీ కొట్టుల వరకు యూపీఐ పేమెంట్స్‌ ఉపయోగిస్తున్నారు.

ఇక ఎక్కడ టెక్నాలజీ పెరుగుతుంతో అక్కడ నేరాలు కూడా పెరగడం కామన్‌. అలాగే యూపీఐ పేమెంట్స్‌లో కూడా ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు సైబర్‌ నేరస్థులు యూపీఐ పేమెంట్స్ ద్వారా మోసాలకు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. అయితే ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని రకాల టిప్స్‌ను పాటించాలని ఎన్‌పీసీఐ చెబుతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ‘మేము మీకు డబ్బులు పంపిస్తున్నాం, ఇందుకోసం క్యూ ఆర్‌కోడ్‌ పంపపాము అది స్మాన్‌ చేయండి’ అంటూ యూపీఐ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే మీకు డబ్బులు పంపడానికి స్కాన్‌ అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైనా నగదు పంపాలనుకుంటేనే క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీకు డబ్బు పంపిస్తున్నామని కోడ్‌ స్కాన్‌ చేయమని చెప్తే అది మోసమని గుర్తించండి.

* ఇక నగదు పొందాలంటే కూడా యూపీఐ పిన్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని మోసం చేస్తున్నారు. మీరు నగదును పొందాలంటే మీ యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం ఉండదని గుర్తించండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారిని టార్గెట్ చేసుకొని ఈ మోసాలు చేస్తున్నారు.

* ఇక ఫోన్‌ నెంబర్లు, క్యూఆర్‌ కోడ్ స్కానర్‌లను గుడ్డిగా నమ్మి పేమెంట్ చేయకూడదు. స్కాన్‌ లేదా ఫోన్‌ నెంబర్‌ ఎంటర్ చేసిన తర్వాత మీరు పంపిస్తున్న వ్యక్తికేనా లేదా అన్న విషయాన్ని గమనించిన తర్వాతే పేమెంట్ చేయాలి.

* ఈ మధ్య కాలంలో కొన్ని రకాల ఆఫర్ల పేరుతో యాప్‌ డౌన్‌లో చేసుకోమని చెబుతూ యూపీఐ పిన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలంటూ కొన్ని మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలియని యాప్స్‌ను డౌన్‌లో చేయకూడదు. అలాగే యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయకూడదు.

* ఇక యూపీఐ ట్రాన్సాక్షన్స్ పేరుతో ఏవైనా ఓటీపీలు వచ్చినా, అవి ఎవరితో పంచుకోకూడదు. యూపీఐ పేమెంట్స్‌ పేరుతో వచ్చే లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..