Eyes: ల్యాప్‌టాప్‌ ముందు గంటల తరబడి కూర్చుంటారా.. 20-20-20 ఫాలో అయితే అంతా సెట్‌

|

Sep 07, 2024 | 4:24 PM

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో స్క్రీన్ టైమ్‌ బాగా పెరిగిపోతోంది. గంటల తరబడి స్క్రీన్స్‌ ముందు గడిపే రోజులు వచ్చేశాయ్‌. వృత్తిపరంగా ల్యాప్‌టాప్‌లతో కుస్తీలు పడుతున్నారు. ఇక సోషల్‌ మీడియా వినియోగం పెరగడంతో స్మార్ట్‌ఫోన్‌స్‌ వినియోగం సైతం ఓ రేంజ్‌లో పెరిగింది. అయితే వీటి నుంచి తప్పించుకోలేని పరిస్థితి. అనివార్యంగా స్క్రీన్‌ టైమ్‌ పెరిగే పరిస్థితి వచ్చింది...

Eyes: ల్యాప్‌టాప్‌ ముందు గంటల తరబడి కూర్చుంటారా.. 20-20-20 ఫాలో అయితే అంతా సెట్‌
Laptop
Follow us on

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో స్క్రీన్ టైమ్‌ బాగా పెరిగిపోతోంది. గంటల తరబడి స్క్రీన్స్‌ ముందు గడిపే రోజులు వచ్చేశాయ్‌. వృత్తిపరంగా ల్యాప్‌టాప్‌లతో కుస్తీలు పడుతున్నారు. ఇక సోషల్‌ మీడియా వినియోగం పెరగడంతో స్మార్ట్‌ఫోన్‌స్‌ వినియోగం సైతం ఓ రేంజ్‌లో పెరిగింది. అయితే వీటి నుంచి తప్పించుకోలేని పరిస్థితి.

అనివార్యంగా స్క్రీన్‌ టైమ్‌ పెరిగే పరిస్థితి వచ్చింది. దీంతో కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ సేపు స్క్రీన్‌ ముందు గడపడం వల్ల కళ్లు పొడిబారడం, మంటగా ఉండడం వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే కొన్ని రకాల టిప్స్‌ పాటించడం ద్వారా కంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని బెస్ట్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బయటి వెలువుతురు అనుగుణంగా బ్రైట్‌నెస్‌ను సెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక టైపింగ్‌ లాంటి వర్క్‌ చేసే వారు టెక్ట్స్ సైజ్‌ను పెంచుకోవాలి. అలాగే స్క్రీన్స్‌ను యాంటీ గ్లేర్‌ స్క్రీన్‌లు ఉపయోగించడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

* స్క్రీన్‌ చూడడం ద్వారా కళ్లపై ప్రభావం పడకుండా ఉండాలంటే 20-20-20 నియమాన్ని పాటింంచాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ నియమమం ఏంటంటే. స్క్రీన్ చూస్తున్న సమయంలో ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు విరామం తీసుకోవాలి. అదే సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును అదే పనిగా కాసేపు గమనించాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. స్క్రీన్‌ను నిరంతరం చూడడం వల్ల కలిగే దుష్ప్రభవం తగ్గుతాయి. కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

* ఇక స్క్రీన్‌ చూస్తున్న సమయంలో కళ్ల రెప్పలు వేస్తుండాలి. అదే పనిగా స్క్రీన్‌ను చూడడం వల్ల కళ్లు పొడిబారి చికాకు పడుతుంది. కంప్యూటర్ లేదా స్మార్ట్‌ ఫోన్‌ను చూసే సమయంలో అప్పుడప్పుడు కళ్లు మూస్తుండాలి. ఇలా చేయడం వల్ల కళ్లు పొడిబారకుండా తేమతో ఉంటాయి. దీంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఐ డ్రప్స్‌ను ఉపయోగించడం కంటే ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

* ఇక మీరు వర్క్‌ చేస్తున్న ప్రదేశం కూడా చూసుకోవాలి. ముఖ్యంగా మీరున్న గదిలో కాంతి సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశంలో కూర్చొని కంప్యూటర్‌పై వర్క్‌ చేయకూడదు. దీనివల్ల స్క్రీన్‌ నుంచి వచ్చే లైట్ కళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది.

* స్క్రీన్‌ ముందు ఎక్కువ సమయం గడిపేవారు కొన్ని రకాల కంటి వ్యాయామాలను అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కంటి కండరాలను బలోపేతం చేయడంలో ఈ వ్యాయామాలు ఉపయోగపడుతాయి. ఇందులో భాగంగా 10 సెకన్ల పాటు కళ్లను అటుఇటు తిప్పాలి. కళ్లు మూసుకొని కాసేపు రిలాక్స్‌ అవ్వాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..