చైనా యాప్‌కు చెక్.. రంగంలోకి ఫేస్‌బుక్..

| Edited By:

Apr 25, 2020 | 4:26 PM

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జూమ్‌ యాప్‌ గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యాప్‌ సెక్యూరిటీ పరంగా ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు.. వెంటనే ఈ యాప్‌ను ఉపయోగించడం మానేయాలని కూడా సూచించింది. అయితే వీడియో కాన్ఫరెన్స్‌కు అనుకూలంగా ఉన్న ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వాధికారులు కూడా ఉపయోగించేది. అంతేకాదు అనేక కంపెనీలు జూమ్‌ యాప్‌కు ప్రత్యామ్నాయంగా అధునాతన ఫీచర్స్‌తో ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌.. జూమ్‌ […]

చైనా యాప్‌కు చెక్.. రంగంలోకి ఫేస్‌బుక్..
Follow us on

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జూమ్‌ యాప్‌ గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యాప్‌ సెక్యూరిటీ పరంగా ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు.. వెంటనే ఈ యాప్‌ను ఉపయోగించడం మానేయాలని కూడా సూచించింది. అయితే వీడియో కాన్ఫరెన్స్‌కు అనుకూలంగా ఉన్న ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వాధికారులు కూడా ఉపయోగించేది. అంతేకాదు అనేక కంపెనీలు జూమ్‌ యాప్‌కు ప్రత్యామ్నాయంగా అధునాతన ఫీచర్స్‌తో ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌.. జూమ్‌ యాప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘మెసెంజర్ రూమ్స్’ పేరుతో తన మెసెంజర్ యాప్‌కు.. కొత్తగా వీడియో కాన్పరెన్స్‌ వెర్షన్‌ను జోడించింది. టైమ్‌ లిమిట్‌తో సంబంధం లేకుండా ఇందులో సంభాషణ కొనసాగించవచ్చు. అంతేకాదు.. ఇందులో మరో విశేషం కూడా ఉంది. తాము సమావేశం కావాలనుకున్న వారికి ఫేస్‌బుక్ అకౌంట్ లేకపోయినా కూడా.. వినియోగదారులు తమ ‘మెసెంజర్‌ రూమ్స్‌’లోకి వారిని ఆహ్వానించవచ్చని తెలుస్తోంది.

కాగా.. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో వీడియో కాలింగ్ కోసం అనేక యాప్‌లు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జూమ్‌ లాంటి యాప్‌లలో వర్చువల్ మీటింగ్స్‌తో పాటు.. అనుకూలమైన ఫోటో బ్యాగ్రౌండ్లకు కూడా వీలుండటంతో లక్షలాది మంది వినియోగదారులు దీనికి ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సింగ్‌ ఫీచర్‌ను డెవలప్ చేసిన ఫేస్‌బుక్‌.. త్వరలోనే మెసెంజర్ రూమ్స్‌కి వర్చువల్ బ్యాగ్రౌండ్లను జోడిస్తామని పేర్కొంది. ప్రస్తుతం మెసెంజర్‌కు మాత్రమే పరిమితమైన ‘రూమ్స్’ను త్వరలోనే మిగతా అనుబంధ సంస్థలైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో కూడా ప్రవేశపెడతామని ఫేస్‌బుక్ పేర్కొంది.