Amazon: ప్రైమ్‌ డే సేల్‌ వేళ జాగ్రత్త.. నకిలీ వెబ్‌సైట్స్‌ని క్లిక్‌ చేస్తే..

|

Jul 18, 2024 | 5:56 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే పేరుతో సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జుల్‌ 20, 21వ తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. కేవలం ప్రైమ్‌ మెంబర్స్‌కి మాత్రమే అందుబాటులోకి వస్తున్న ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ అందించనున్నారు. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహెపకరణాల వరకు అన్ని రకాల...

Amazon: ప్రైమ్‌ డే సేల్‌ వేళ జాగ్రత్త.. నకిలీ వెబ్‌సైట్స్‌ని క్లిక్‌ చేస్తే..
Cyber Crime
Follow us on

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే పేరుతో సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జుల్‌ 20, 21వ తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. కేవలం ప్రైమ్‌ మెంబర్స్‌కి మాత్రమే అందుబాటులోకి వస్తున్న ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ అందించనున్నారు. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహెపకరణాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపు ధరలకు ప్రకటించాయి.

అయితే సేల్ ఇంకా లైక్‌కి రాకముందే సైబర్‌ నేరస్థులు తమ పని మొదలు పెట్టారు. ఎప్పుడు అవకాశం దొరుకుందా.? ఎలా ప్రజలను మోసం చేద్దామని చూసే సైబర్‌ నేరస్థులు ఈసారి ప్రైమ్‌ యూజర్లను దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నకిలీ వెబ్‌సైట్స్‌ను సృష్టించి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించి సెబర్‌ సెక్యూరిటీ అలర్ట్‌ చేస్తోంది. అచ్చంగా అమెజాన్‌ను పోలినట్లు ఉన్న కొన్ని వెబ్‌సైట్స్‌ను సైబర్ సెక్యూరిటీ వెబ్‌సైట్ చెక్‌పాయింట్ వెల్లడించింది. కింద పేర్కొన్న లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదని చెబుతున్నారు.
* amazon-onboarding[.]com
* amazonmxc[.]shop
* amazonindo[.]com
* shopamazon2[.]com
* microsoft-amazon[.]shop
* amazonapp[.]nl
* shopamazon3[.]com
* amazon-billing [.]top
* amazonshop1[.]com
* fedexamazonus[.]top
* amazonupdator[.]com
* amazon-in[.]net
* espaces-amazon-fr[.]com
* usiamazon[.]com
* amazonhafs[. ]buzz
* usps-amazon-us[.]top
* amazon-entrega[.]info
* amazon-vip[.]xyz
* paqueta-amazon[.]com
* connect-amazon[.]com
user-amazon-id[ .]com
* amazon762[.]cc
* amazoneuroslr[.]com
* amazonw-dwfawpapf[.]top
* amazonprimevidéo[.]com

పలు రకాల ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్స్‌ పేరుతో వాట్సాప్‌, టెలిగ్రామ్‌తోపాటు నార్మల్‌ మెసేజ్‌లో కొన్ని లింక్‌లను పంపిస్తున్నారు. వీటిలో స్మార్ట్‌ ఫోన్‌లు మొదలు పలు గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్‌ అంటూ మెసేజ్‌లను పంపిస్తున్నారు. పొరపాటుఈ లింక్‌లను కొనుగోలు చేసి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే అంతే సంగతులు. మీ బ్యాంక్‌ వివరాలతో పాటు క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌ వివరాలను కాజేసి డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..